సరిహద్దుల్లో కాల్పులు..జవాన్ మృతి

బోర్డర్ లో పాక్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.పాక్ సైన్యం కాల్పులకు తెగబడటంతో… భారత సైనికుడు కరమ్ జీత్ సింగ్(24) తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయాడు. మరో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. జమ్మూకాశ్మీర్‌లోని రజౌరీ, సుందర్‌ బనీ సెక్టార్‌ లో సోమవారం(మార్చి-18,2019) ఉదయం పాక్ సైనికులు చిన్నపాటి ఆయుధాలు, మోర్టార్లతో కాల్పులకు తెగబడ్డారని రక్షణ బలగాల అధికార ప్రతినిధి లెఫ్టినెంట్‌ కల్నల్‌ దేవేంద్ర ఆనంద్‌ తెలిపారు. ఈ కాల్పులను భారత  సైన్యం దీటుగా తిప్పికొట్టిందన్నారు. ఉదయం 5:30 గంటలకు మొదలైన ఫైరింగ్ 7:15 గంటల వరకు కొనసాగినట్లు ఆయన తెలిపారు.

 ఆదివారం ఉదయం కూడా పాక్‌ బలగాలు కాల్పులకు దిగాయి. భారత సైన్యం దీటుగా సమాధానం చెప్పడంతో తోకముడిచాయి. పుల్వామా, బాలాకోట్‌ ఘటనల తరవాత పాక్‌ సైన్యం ఎల్ వోసీ దగ్గర తరచూ కాల్పుల  విరమణ ఒప్పందానికి ఉల్లంఘిస్తూ భారత జవాన్లపై కాల్పులకు దిగుతోంది.మోర్టార్లు, చిన్నపాటి ఆయుధాలతో సరిహద్దు గ్రామాలపై విరుచుకుపడుతోంది. పాక్ కాల్పులను భారత్ ఎప్పటికప్పుడు భారత్ ధీటుగా తిప్పికొడుతోంది. 

ట్రెండింగ్ వార్తలు