దీపావళి పండుగ సంబురాలలో ఉత్తరప్రదేశ్ వెలిగిపోతోంది. ముఖ్యంగా దీపావళి సందర్భంగా శ్రీరాముడు జన్మించి అయోధ్యలో సీఎం ఆదిత్యానాథ్ 5.5 లక్షల దీపోత్సవాన్ని చేయటానికి విస్తృత ఏర్పాట్లు చేసింది. శ్రీరాముడు 14 సంవత్సారల వనవాసం ముగించుకుని సీతా సమేతుడై అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడు అయిన శుభ వేడుక సందర్భంగా అయోధ్య వాసులంతా దీపాలు వెలిగించి దీపావళి పండుగ చేసుకున్నారనీ పురాణాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో ఈ బృహత్తర కార్యక్రమాన్ని సీఎం యోగీ ప్రభుత్వం చేపట్టింది. ఐదు రోజుల పాటు యూపీ వాసులంతా దీపావళి వేడుకలు జరుపుకుంటారు.
ఈ దీపోతవ్సం గురించి అయోధ్య బీజేపీ ఎమ్మెల్యే వేద ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ..అయోధ్య పర్యాటక రంగం పెంపొందించడానికి దీపావళి పండుగ సందర్భం మంచి అవకాశమని అన్నారు. అక్టోబర్ 26 శనివారం సాయంత్రం 5.50 లక్షలకు పైగా మట్టి దీపాలను వెలిగిస్తారని తెలిపారు. ఈ దీపోత్సవానికి ప్రభుత్వం రూ.130 కోట్ల రూపాయలకు పైగా కేటాయించింది. దీపోత్సవ్ వెనుక ఉన్న దృష్టి ఆధ్యాత్మికం మాత్రమే కాదు..పర్యాటకాన్ని కూడా పెంచుతుందని గుప్తా అన్నారు.
14 సంవత్సరాల వనవాసం తరువాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి రావడాన్ని సూచిస్తున్న సందర్భంగా ఐదు రోజుల పాటు దీపావళి పండుగకు విస్తృతమైన ప్రణాళికలు చేసింది. ఈ ఉత్సవాన్ని తిలకించటానికి భక్తులు భారీగా తరలిరానున్నారని దీని కోసం తగిన ఏర్పాట్లు చేశామన్నారు. ఈ వేడుకల్లో వేలాదిమంది కళాకారులు పాల్గొన్నారు. పలు విధాల కళలను ప్రదర్శించి చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. రకాల వేషధారణలతో ఆట పాటలతో అలరిస్తున్నారు.
Artists gather in Ayodhya for ‘deepotsav’ procession. Over 5.50 lakh earthen lamps will be lit at Saryu Ghat, today evening as a part of #Diwali celebrations. pic.twitter.com/s9YZxRSj2T
— ANI UP (@ANINewsUP) October 26, 2019
Ayodhya: Artists participate in ‘Deepotsav’ procession. Over 5.50 lakh earthen lamps will be lit at Saryu Ghat, today evening as a part of #Diwali celebrations. pic.twitter.com/CzQ3U3IzCC
— ANI UP (@ANINewsUP) October 26, 2019
Ayodhya: Arrangements underway at Saryu Ghat for ‘deepotsav’ that will be held today evening. Over 5.50 lakh earthen lamps will be lit during the event. #Diwali pic.twitter.com/1jZFFm1PJ1
— ANI UP (@ANINewsUP) October 26, 2019