అసోంలో 5.9 తీవ్రతతో భారీ భూకంపం.. జనాలు పరుగులు.. భూటాన్, మయన్మార్‌లోనూ..

భూకంప కేంద్రం సోనిత్‌పూర్ జిల్లా ధేకియాజులి నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రాణ, ఆస్తి నష్టంపై సమాచారం రాలేదు.

Assam earthquake

Assam earthquake: అసోంలో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 5.9గా నమోదైందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. పలు ప్రాంతాల్లో జనాలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు.

ఇవాళ సాయంత్రం 4.41 గంటలకు భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం సోనిత్‌పూర్ జిల్లా ధేకియాజులి నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రాణ, ఆస్తి నష్టంపై సమాచారం రాలేదు.

స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర సహా ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ప్రకంపనలు వచ్చాయి. అలాగే, భూటాన్, మయన్మార్‌లోనూ భూమి కంపించింది. (Assam earthquake)

భూకంపంపై కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ ట్వీట్ చేశారు. “అసోంలో భారీ భూకంపం సంభవించింది. అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. అందరూ అప్రమత్తంగా ఉండండి” అని అన్నారు.

Also Read: బెంగళూరు-హైదరాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌.. కేవలం 2 గంటల్లో ప్రయాణం.. ఫుల్‌ డీటెయిల్స్‌..