×
Ad

Anti Polygamy Bill : రెండో పెళ్లి చేసుకుంటే ఏడేళ్లు జైలు శిక్ష.. బిల్లు పాస్ చేసిన అసెంబ్లీ.. వారికి మాత్రం మినహాయింపు..!

Anti Polygamy Bill : బహుభార్యత్వాన్ని నిషేధిస్తూ ప్రవేశపెట్టిన బిల్లును అసెంబ్లీలో ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం.. బహుభార్యత్వాన్ని ఆచరించే ఎవరైనా నేరంగా పరిగణించబడతారు.

Anti Polygamy Bill

Assam Prohibition of Polygamy Bill : అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహుభార్యత్వాన్ని నిషేధిస్తూ ప్రవేశపెట్టిన బిల్లును అసెంబ్లీలో ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం.. బహుభార్యత్వాన్ని ఆచరించే ఎవరైనా నేరంగా పరిగణించబడతారు.

అస్సాం రాష్ట్రంలో ఇకపై భాగస్వామికి విడాకులు ఇవ్వకుండా ఎవరైనా రెండో పెళ్లి చేసుకుంటే ఏడేళ్లు జైలుశిక్ష పడేలా హిమంతబిశ్వ శర్మ సర్కారు బిల్లును రూపొందించింది. ఈ బిల్లు అసెంబ్లీలో పాసైంది. బిల్లు నిబంధనల ప్రకారం.. బాధితులకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఒకసారి పెళ్లి జరిగిందనే విషయాన్ని దాచిపెట్టి మళ్లీ వివాహం చేసుకుంటే పదేండ్ల జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధిస్తారు. అయితే, రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ ప్రకారం షెడ్యూల్డ్ తెగలు, ఏరియాలకు ఈ బిల్లు నుంచి మినహాయింపు ఇచ్చారు.

Also Read: కొత్త లేబర్‌ కోడ్స్‌: గిగ్ వర్కర్లు సహా ఉద్యోగులు తెలుసుకోవాల్సిన 5 కీలక అంశాలు ఇవే.. ఎన్ని లాభాలో..

బిల్లు ప్రకారం.. గ్రామ పెద్ద, తల్లిదండ్రులు, సంరక్షకులు వాస్తవాలను దాచిపెట్టి లేదా ఉద్దేశపూర్వకంగా బహుభార్యత్వ వివాహంలో భాగస్వాములు అయితే.. రెండేళ్లు వరకు జైలు శిక్ష, రూ.లక్ష వరకు జరిమానా విధించడం జరుగుతుంది. ఈ చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైనా వివాహాన్ని జరిపిస్తే రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.150లక్షల వరకు జరిమానా విధించడం జరుగుతుంది.

ఈ సందర్భంగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ.. మహిళల హక్కుల విషయంలో తమ ప్రభుత్వం రాజీపడబోదని స్పష్టం చేశారు. నారీ శక్తిని చాటేలా ఈ బిల్లును రూపొందించామని అన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే.. మొదటి అసెంబ్లీ సమావేశంలోనే రాష్ట్రంలో యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)ను అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు. అస్సాంలో బహుభార్యత్వ నిరోధక చట్టం యూసీసీ వైపు మొదటి అడుగు అని ఆయన పేర్కొన్నారు.