Assam: ఆరేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తికి అసోం ట్రిబ్యునల్‌ నోటీసులు

ఆరేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తికి అసోం ట్రిబ్యునల్‌ నోటీసులు జారీ చేసింది.

Assam Foreigners’ Tribunal Serves Notice To Dead Man

Assam Foreigners’ Tribunal serves notice to dead man : ప్రభుత్వ అధికారులు ఇచ్చే సర్టిఫికెట్లలోను..జారీ చేసే నోటీసుల్లోను తప్పులు ఉండటం పరిపాటే. అటువంటిదే జరిగింది అసోంలో. ఆరు సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తి ప్రభుత్వం అధికారులు నోటీసులు పంపించారు. భారతదేశంలో నివసించే వ్యక్తికి నువ్వు భారత పౌరుడివేనని నిరూపించుకునే పేపర్లు ఇవ్వాలి అంటూ నోటీసులు జారీ చేశారు. అసోం ట్రిబ్యునల్ అధికారులు ఇచ్చిన అధికారుల నోటీసు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also read : Maharashtra : 60 వేల మందికి చుక్కలు చూపించిన పిల్లి..! ఏకంగా రూ.100 కోట్ల నష్టం..!!

అసోంలో కాచర్ లోని ఫారిన్సర్స్‌ ట్రిబ్యునల్‌ తాజాగా నోటీసులు వైరల్ గా మారాయి. ‘నువ్వు భారత పౌరునివేనని నిరూపించే దృవపత్రాలు ఏమీ సమర్పించలేకపోయావు. కాబట్టి మార్చి 30లోగా మా ముందు హాజరవాల్సిందే’’ అని ఆదేశిస్తూ..శ్యామన్ చరణ్ దాస్ అనే వ్యక్తికి నోటీసులు ఇచ్చింది. 1966–73 మధ్య శ్యామన్ సరైన పత్రాలు లేకుండా అసోంలోకి అక్రమంగా ప్రవేశించాడని నోటీసులో పేర్కొంది ఫారిన్సర్స్‌ ట్రిబ్యునల్.

శ్యామన్‌ చరణ్‌దాస్‌ అనే సదరు వ్యక్తి అసోంలో ఉదార్‌బండ్‌ ప్రాంతంలోని తాలిగ్రాంలో తన కుటుంబంతో కలిసి నివసించేవాడు. శ్యామన్ భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించాడంటూ 2015లో అతనిపై కేసు నమోదైంది. ఆ తరువాత (2016)సంవత్సరంలో శ్యామన్‌ చనిపోయాడు. దీంతో శ్యామన్ కుటుంబ సభ్యులు డెత్‌ సర్టిఫికెట్‌ కూడా తీసుకున్నారు. ఆ సర్టిఫికెట్ ను ట్రిబ్యునల్ కు సమర్పించడంతో ట్రిబ్యునలే కేసును మూసేయడం కూడా జరిగాయి.

Also read :The Kashmir Files: కశ్మీర్ ఫైల్స్ సినిమా మీద ట్వీట్ చేసిన ఐఏఎస్‌కు నోటీసులు

ఆ తరువాత ఆరేళ్లకు అదే ట్రిబ్యునల్‌ అధికారులు శ్యామన్ కు మార్చి 15,2022న మళ్లీ నోటీసులిచ్చారు. శ్యామన్ మార్చి 30న కోర్టులో హాజరు కావాలి అంటూ నోటీసులో పేర్కొన్నారు. ఆ నోటీసు చూసిన శ్యామన్ కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. అస్సాం ప్రభుత్వం జారీ చేసిన మరణ ధృవీకరణ పత్రం ప్రకారం..శ్యామన్ దాస్ మే 6, 2016 న 74 సంవత్సరాల వయస్సులో మరణించాడు.

ఈ నోటీసుపై స్థానిక ఎస్పీ రమణ్‌దీప్‌ కౌర్‌ మాట్లాడుతూ..శ్యామన్‌పై బీఎస్‌ఎఫ్‌ ఇటీవల మళ్లీ కేసు పెట్టిందని..అందుకే ట్రిబ్యునల్‌ రొటీన్‌గా నోటీసులిచ్చి ఉంటుందని తెలిపారు. నిందితుడు చనిపోయాడు కాబట్టి ఇక ఈ కేసునూ మూసేస్తామంటూ చెప్పుకొచ్చారు.