జోరువానలోనూ డ్యూటీ : ట్రాఫిక్ పోలీస్ అంకితభావం

జోరుగా వర్షం కురుస్తోంది. రోడ్డుపై వాహనాలు వర్షపునీటిలో దూసుకెళ్తున్నాయి. రోడ్డుపై వరదనీరు ఏరులై పారుతోంది. నడిరోడ్డుపై ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు. చూస్తుంటే.. విగ్రహంలా కనిపిస్తుంది..

  • Publish Date - April 1, 2019 / 10:24 AM IST

జోరుగా వర్షం కురుస్తోంది. రోడ్డుపై వాహనాలు వర్షపునీటిలో దూసుకెళ్తున్నాయి. రోడ్డుపై వరదనీరు ఏరులై పారుతోంది. నడిరోడ్డుపై ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు. చూస్తుంటే.. విగ్రహంలా కనిపిస్తుంది..

జోరుగా వర్షం కురుస్తోంది. రోడ్డుపై వరదనీరు ఏరులై పారుతోంది. వర్షపునీటిలో వాహనాలు దూసుకెళ్తున్నాయి.  నడిరోడ్డుపై ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు. చూస్తుంటే.. విగ్రహంలా కనిపిస్తుంది.. కాదండోయ్.. నిజంగా మనిషే.. ఎవరో కాదు.. ట్రాఫిక్ పోలీసు.. వర్షం కురుస్తున్నా ఎందుకు అలానే నిలబడ్డాడు అనుకుంటున్నారా? డ్యూటీ. మీరు చదివింది నిజమే. భారీ వర్షం కురుస్తున్నా.. కనీసం రెయిన్ కోట్ కూడా వేసుకోలేదు. ఉరుములు, మెరుపులు మెరుస్తున్నాయి. 
Read Also : ప్రళయానికి సంకేతమా! : 2 గంటల్లో 9 భూకంపాలు

అయిన కొంచెం కూడా బెదరలేదు. వణికిపోలేదు. అలానే నడిరోడ్డుపై విగ్రహంలా నిలబడి విధులు నిర్వర్తించాడో ట్రాఫిక్ పోలీసు. విధి నిర్వహణలో అతడి అంకితభావం ముందు మరొకరు సాటి లేరు అని నిరూపించాడు. జోరువానలో కూడా డ్యూటీ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అతడే.. మిథున్ దాస్.. అస్సాం పోలీసు ట్రాఫిక్ కానిస్టేబుల్. వర్షంలో తడుస్తూనే ట్రాఫిక్ పోలీసుగా విధులు నిర్వరించిన దాస్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. వర్షంలో ట్రాఫిక్ పోలీసు దాస్ డ్యూటీ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇదే ఆ వీడియో..