Woman Gives Birth To 4 Babies : దినసరి కూలి మహిళలకు ఒకే కాన్పులో నలుగురు శిశువులు జననం..

కూలి పనులు చేసుకుని జీవించే మహిళకు రెండో కాఃన్పుల్లో నలుగురు బిడ్డలకు జన్మనిచ్చింది. అప్పటికే ఓ పాప కూడా ఉంది.

Woman Gives Birth To 4 Babies

Woman Gives Birth To 4 Babies : ఒక బిడ్డను తొమ్మిది నెలలు మోసి ప్రసవించటం మహిళకు మరో జన్మలాంటిది అంటారు. అటువంటిది ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు శిశులకు జన్మనిచ్చింది. దినసరి కూలిగా పనిచేస్తు జీవించే పేదరాలికి నలుగురు బిడ్డలు ఒకేసారి పుట్టారు. అస్సాంలోని కరీంగంజ్‌ జిల్లా బజారిచర ప్రాంత క్రిస్టియన్‌ మిషనరీ ఆస్పత్రిలో ఓ మహిళ ముగ్గురు మగబిడ్డలు, ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈమెకు ఇప్పటికే ఓ పాప ఉంది. రెండో కాన్పులో నలుగురు బిడ్డలు జన్మించినందుకు ఆనందపడాలో..వారిని ఎలా పెంచాలో అనే ఆందోళనపడాలో అర్థంకాని పరిస్థితితో ఉందా పేద తల్లి. నలుగురు శిశులు చక్కటి ఆరోగ్యంతో ఉండటం మరో విశేషం..

స్థానిక నీలం బజార్‌కు చెందిన లాస్టింగ్‌ ఖచియా, జనతా ఖచియా దంపతులకు ఓ పాప ఉంది. రెండో కాన్పు కోసం జనతా ఖచియాను సోమవారం (ఏప్రిల్17,2023) తెల్లవారుజామున క్రిస్టియన్‌ మిషనరీ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెను పరీక్షించిన డాక్టర్లు గర్భంలో నలుగురు శిశువులు ఉన్నారని చెప్పారు. శస్త్రచికిత్స ద్వారా కాన్పు చేశారు.

Woman Gives Birth To 9 Babies : వామ్మో.. ఒకే కాన్పులో 9మందికి జన్మనిచ్చిన మహిళ, గిన్నిస్ వరల్డ్ రికార్డ్

కాగా ఆఫ్రికాకు చెందిన ఓ మహిళ ఒకే కాన్పులో 9మందికి జన్మనిచ్చింది.  గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. మొరాకోలోని కాసాబ్లాంకాకు చెందిన సీసా అనే మహిళ గర్భం దాల్చిన 30 వారాలకు సిజేరియన్ ద్వారా ఐదుగురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలకు జన్మనిచ్చింది.

కాగా గత మార్చి నెలలో తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలానికి చెందిన దినసరి కూలీ దంపతులకూ రెండో కాన్పులో ముగ్గురు మగ శిశువులు, ఓ ఆడశిశువు జన్మించారు.అలాగే 2021లో అస్సాంలోని ధుబ్రి జిల్లాలోని రంగియాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఓ మహిళ ఇద్దరు మగబిడ్డలు, ఇద్దరు ఆడబిడ్డలకు జన్మనిచ్చింది. ఇలా ముగ్గురు నలుగురు బిడ్డలు జన్మించటం కొన్ని కాన్పుల్లో బిడ్డలు ఆరోగ్యంగా ఉండగా మరికొన్ని కాన్పుల్లో బిడ్డలు అనారోగ్యంతో జన్మించటం లేదా మరణించటం జరుగుతుంటుందని డాక్టర్లు తెలిపారు.