Woman Gives Birth To 9 Babies : వామ్మో.. ఒకే కాన్పులో 9మందికి జన్మనిచ్చిన మహిళ, గిన్నిస్ వరల్డ్ రికార్డ్

ఆఫ్రికాకు చెందిన ఓ మహిళ ఒకే కాన్పులో 9మందికి జన్మనిచ్చింది. తాజాగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు.. దాన్ని ప్రపంచ రికార్డ్ గా గుర్తించారు. మొరాకోలోని కాసాబ్లాంకాకు చెందిన సీసా అనే మహిళ గర్భం దాల్చిన 30 వారాలకు సిజేరియన్ ద్వారా ఐదుగురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలకు జన్మనిచ్చింది.

Woman Gives Birth To 9 Babies : వామ్మో.. ఒకే కాన్పులో 9మందికి జన్మనిచ్చిన మహిళ, గిన్నిస్ వరల్డ్ రికార్డ్

Updated On : December 22, 2022 / 9:54 PM IST

Woman Gives Birth To 9 Babies : ఇద్దరు కాదు నలుగురు కాదు.. ఏకంగా 9మంది శిశువులకు జననం. అదీ ఒకే కాన్పులో. ఏంటి షాక్ అయ్యారు కదూ. అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు కదూ. కానీ, ఇది నిజం. ఆ మహిళ ఒకే కాన్పులో 9మందికి జన్మనిచ్చింది. తద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది.

గతేడాది ఉత్తర ఆఫ్రికాకు చెందిన ఓ మహిళ ఒకే కాన్పులో 9మందికి జన్మనిచ్చింది. తాజాగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు.. దాన్ని ప్రపంచ రికార్డ్ గా గుర్తించారు. మొరాకోలోని కాసాబ్లాంకాకు చెందిన సీసా అనే మహిళ గర్భం దాల్చిన 30 వారాలకు సిజేరియన్ ద్వారా ఐదుగురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలకు జన్మనిచ్చింది.

ఒకే కాన్పులో 9మందికి జన్మనిచ్చి ఆమె ప్రపంచ రికార్డ్ సృష్టించినట్లు గిన్నిస్ వరల్డ్ తన ఇన్ స్టా ఖాతాలో తెలిపింది. ఈ మేరకు ఓ వీడియోను షేర్ చేసింది.

సాధారణంగా మహిళలు కవల పిల్లలకు జన్మనివ్వడమే అరుదుగా జరుగుతుంది. కొన్నిసార్లు ముగ్గురికి జన్మనిచ్చిన ఘటనలు చూశాం. అంతే కాదు ఒకే కాన్పుల్లో నలుగురికి జన్మనిచ్చిన ఘటనలూ అప్పుడప్పుడు విన్నాం. కానీ ఒకే కాన్పులో తొమ్మిది మందికి జన్మనివ్వడం మాత్రం వండరే. వాస్తవానికి.. ఏడుగురు పిల్లలే జన్మిస్తారని డాక్టర్లు అనుకున్నారు. అదనంగా మరో ఇద్దరు పిల్లలు పుట్టేసరికి వారూ షాక్ అయ్యారు.

అంతే కాదండోయ్.. అలా పుట్టిన పిల్లలందరూ ఎంతో ఆరోగ్యంగా ఉండటం మరో విచిత్రం. ఆఫ్రికాలోని మాలీ దేశానికి చెందిన హాలిమా సిస్సే.. ఒకే కాన్పులో తొమ్మిది మందికి జన్మనిచ్చి అందరూ నివ్వెరపోయేలా చేశారు. ఆమె తొమ్మిది మంది చిన్నారులకు జన్మనిచ్చింది. వీరిలో ఐదుగురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు ఉన్నారు.