Corona in India: దేశంలో కొనసాగుతున్న కోవిడ్ ఉధృతి: 3551 కొత్త కేసులు, 40 మరణాలు

కేంద్ర వైద్యారోగ్యశాఖ ఆదివారం తెలిపిన వివరాలు మేరకు గడిచిన 24 గంటల్లో దేశంలో 3551 కరోనా కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి, 40 మంది మహమ్మారి భారిన పడి మృతి చెందారు.

Corona in India: దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. భారత్‌లో కరోనా కేసుల సంఖ్య తగ్గినట్లే తగ్గి మళ్ళీ పెడుతున్నాయి. కేంద్ర వైద్యారోగ్యశాఖ ఆదివారం తెలిపిన వివరాలు మేరకు గడిచిన 24 గంటల్లో దేశంలో 3551 కరోనా కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో 40 మంది మహమ్మారి భారిన పడి మృతి చెందారు. కొత్తగా నమోదు అయిన కేసులతో కలిపి ప్రస్తుత యాక్టివ్ కేసుల సంఖ్య 20,635కి చేరింది. భారత్‌లో యాక్టివ్ కేసులు 0.05 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 4,31,02,194 పాజిటివ్ కేసులు బయటపడగా, 5,24,064 మరణాలు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్‌లో గడిచిన 24 గంటల్లో 3079 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Also read:Ucil Jobs : యురేనియం కార్పొరేషన్ లో అప్రెంటిస్ ల భర్తీ

దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,25,57,495కి చేరగా కరోన రికవరీ రేటు 98.74 శాతంగా నమోదు అయింది. మరోవైపు భారత్‌లో 478 రోజులుగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 17,39,403 డోసుల టీకాలు పంపిణీ చేయగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 190.20 కోట్ల డోసుల టీకాలు పంపిణీ జరిగింది. అదే సమయంలో భారత్‌లో కరోనా నిర్ధరణ పరీక్షలు 84.06 కోట్లు దాటింది. గడిచిన 24 గంటల్లో 3,60,613 టెస్టులు నిర్వహించారు. దేశవ్యాప్తంగా 3370 లాబ్స్‌లో కరోనా నిర్ధరణ పరీక్షలు జరుగుతున్నాయి. 1431 ప్రభుత్వ, 1939 ప్రైవేట్ లాబ్స్‌లో కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తున్నారని ఐసీఎంఆర్ వెల్లడించింది.

Also read:Gyanvapi Swasthika: మసీదు సర్వేలో బయటపడ్డ హిందూ పురాతన స్వస్తికలు: ఆందోళన నేపథ్యంలో సర్వే నిలిపివేత

ట్రెండింగ్ వార్తలు