Uttarakhand Accident
Uttarakhand Accident: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. హరిద్వార్ జిల్లాలోని లాల్‌ఢాంగ్ నుంచి పౌరీ గర్వాల్ జిల్లాలోని రిఖ్నిఖాల్ – బిరోఖల్ రహదారిపై వెళ్తున్న పెళ్లిబృందం బస్సు అదుపుతప్పి 500 మీటర్ల లోయలో పడిపోయింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో పిల్లలతో సహా 50 మందికిపైగా ఉన్నారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 25 మంది మరణించగా, 20 మందిని రక్షించామని, ఇంకా ఆపరేషన్ కొనసాగుతోందని రాష్ట్ర పోలీసులు తెలిపారు.
Dalit Man Murdered : ఉత్తరప్రదేశ్‌లో అమానుషం.. దేవతా విగ్రహాన్ని తాకాడని దళితుడి దారుణ హత్య
ఇప్పటికి వరకు అందిన సమాచారం ప్రకారం.. ఈ ప్రమాదంలో గాయపడ్డ 20మందిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని, వారికి వైద్య సదుపాయాలు అందిస్తున్నట్లు ఉత్తరాఖండ్ పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే నాలుగు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఘటన స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. అయితే ప్రమాదం రాత్రి సమయంలో జరగడంతో సహాయక చర్యలకు అటంకాలు ఏర్పడ్డాయి. ప్రమాద స్థలిలో ఎటువంటి వెలుతురు లేకపోవడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సెల్ ఫోన్ల ప్లాష్‌లైట్ల వెలుగులో బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు.
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..
ప్రమాద సమయంలో బస్సు వేగంగా వెళ్లి బ్యారియర్లను చీల్చుకుంటూ చెట్టును ఢీకొట్టి లోయలోపడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేసి ఆయన వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.