Dalit Man Murdered : ఉత్తరప్రదేశ్‌లో అమానుషం.. దేవతా విగ్రహాన్ని తాకాడని దళితుడి దారుణ హత్య

ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌ జిల్లాలో అమానుష ఘటన జరిగింది. దేవతా విగ్రహాన్ని తాకాడని దళితుడిని దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన ఉద్దా గ్రామంలో చోటుచేసుకుంది. దుర్గాపూజ మండపంలోని దేవతా విగ్రహాన్ని తాకినందుకు అగ్ర కులస్తులు కొట్టి హత్య చేశారని బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. 

Dalit Man Murdered : ఉత్తరప్రదేశ్‌లో అమానుషం.. దేవతా విగ్రహాన్ని తాకాడని దళితుడి దారుణ హత్య

Dalit man murdered

Dalit Man Murdered : శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నా దేశంలో కుల వివక్ష కొనసాగుతూనేవుంది. దళితులపై దాడులు, హత్యలు జరుగుతూనేవున్నాయి.  ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌ జిల్లాలో అమానుష ఘటన జరిగింది. దేవతా విగ్రహాన్ని తాకాడని దళితుడిని దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన ఉద్దా గ్రామంలో చోటుచేసుకుంది. దుర్గాపూజ మండపంలోని దేవతా విగ్రహాన్ని తాకినందుకు అగ్ర కులస్తులు కొట్టి హత్య చేశారని బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

దురాగతంపై మృతుడు జగ్‌రూప్‌ భార్య మాట్లాడుతున్న వీడియోను ఓ హిందీ న్యూస్‌ పోర్టల్‌ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. దుర్గా పూజను చూసేందుకు తన భర్త సమీపంలోని ఓ ఇంటికి వెళ్లారని, అక్కడ అతన్ని కొట్టి చంపారని ఆరోపించారు. మున్నా, సందీప్‌ అనే ఇద్దరు వ్యక్తుల పేర్లను కూడా ఆమె ప్రస్తావించారు. ఆ వీడియోలో మూటకట్టిన జగ్‌పూర్‌ మృతదేహం కూడా కనిపిస్తోంది.  మరో వీడియోలో జగ్‌రూప్‌ అల్లుడు మాట్లాడుతూ.. తన మామ విగ్రహం పాదాలు తాకాడని, అక్కడున్న వారు విచక్షణారహితంగా కొట్టారని, తర్వాత ఇంటి వద్దకు తెచ్చి పడేశారని తెలిపారు.

Kadapa : దళితుడి మృతదేహాన్ని స్మశానానికి తీసుకెళ్లకుండా అడ్డగింపు

చికిత్స కోసం ఆస్పత్రికి తరలించామని, అయితే అప్పటికే మరణించాడని డాక్టర్లు చెప్పారని తెలిపారు. అయితే ఈ హత్యకు కులం కారణం కాదని పైకి చెబుతున్న పోలీసులు.. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయడం గమనార్హం.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.