Kadapa : దళితుడి మృతదేహాన్ని స్మశానానికి తీసుకెళ్లకుండా అడ్డగింపు

కడప జిల్లా రామాపురం మండలంలోని సుద్ధమల్లలో ఓ దళిత వ్యక్తి మరణించారు. ఆ వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు వెళ్తుండగా పట్టాదారు బాట లేదని కంచెను ఏర్పాటు చేశాడు. కంచెను తొలగించుకుని శవాన్ని తీసి వెళ్లడానికి ప్రయత్నించగా, పట్టాదారులు శవాన్ని అడ్డుకున్నారు.

Kadapa : దళితుడి మృతదేహాన్ని స్మశానానికి తీసుకెళ్లకుండా అడ్డగింపు

Dalit Dead Body

Dalit dead body : అత్యాధునిక యుగంలోనూ దళితులకు అవమానాలు తప్పడం లేదు. హైటెక్ యుగంలోనూ కుల వివక్ష కొసాగుతోంది. సాటి మనిషిని మనిషిగా చూడటం లేదు. నిత్య జీవితంలో దళితులు ఎన్నో అవమానాలను ఎదుర్కొంటున్నారు. బతికున్నప్పుడే కాకుండా చనిపోయాక కూడా వివక్ష చూపుతున్నారు. తాజాగా ఏపీలో దళితుడి శవాన్ని స్మశానానికి తీసుకెళ్లకుండా అడ్డుకున్నారు. అంత్యక్రియలకు ఆటంకం కల్పించారు.

కడప జిల్లా రామాపురం మండలంలోని సుద్ధమల్లలో ఓ దళిత వ్యక్తి మరణించారు. ఆ వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు వెళ్తుండగా పట్టాదారు బాట లేదని కంచెను ఏర్పాటు చేశాడు. కంచెను తొలగించుకుని శవాన్ని తీసి వెళ్లడానికి ప్రయత్నించగా, పట్టాదారులు శవాన్ని అడ్డుకున్నారు.

Caste Discrimination : గుడికి వెళ్లిన దళితుడు..అపవిత్రం అయ్యిందంటూ 25 వేలు జరిమానా..

దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దళితులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఎట్టకేలకు శవాన్ని స్మశానానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించుకున్నారు.