Atishi, Saurabh Bharadwaj take oath as ministers in Arvind Kejriwal’s Cabinet
ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు అతిషి, సౌరభ్ భరద్వాజ్ లు ఈరోజు (మార్చి 9,2023) మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. సౌరభ్ భరద్వాజ్ కు ఆరోగ్యం,పట్టణాభివృద్ధి, నీటి పరిశ్రమల శాఖలు అప్పగించగా అతిసిహ్ కు విద్య,PWD, విద్యుత్,పర్యాటక శాఖల బాధ్యతలు అప్పగించారు. ఢిల్లీ మంత్రిగా సౌరభ్ భరద్వాజ్ ప్రమాణస్వీకారం చేయడం ఇది రెండోసారి. 2013 ఆప్ నేతృత్వంలోని అరవింద్ కేజ్రీవాల్ క్యాబినెట్ లో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు.
Viral Video: యూపీలో దారుణ ఘటన.. 4 ఏళ్ల చిన్నారిని కిరాతకంగా కుమ్మేసిన ఆంబోతు
అతిషి మనీష్ సిసోడియా ఆధ్వర్యంలో విద్యా శాఖ సలహాదారుగా పనిచేశారు. కాగా అవినీతి, మనీలాండరింగ్ కేసులకు సంబంధించి మనీష్ సిసోడియా,సత్యేందర్ జైన్ లు తమ మంత్రి పదవులకు రాజీనామా చసిన తరువాత రెండు ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేలు అతిషి, సౌరభ్ భరద్వాజ్ లకు అరవింద్ కేజ్రీవాల్ క్యాబినెట్ లో చోటు దక్కింది.
PM Modi: మోదీ స్టేడియంలో మోదీకి మోదీ ఫొటో బహుమానం
ఢిల్లీ ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రుల రాజీనామాలతో ఖాళీ అయిన శాఖల భర్తీకి సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేబినెట్లోకి తీసుకునేందుకు ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లు సిఫార్సు చేస్తూ గవర్నర్ వీకే సక్సేనాకు లేఖ పంపారు. మరోవైపు పదవుల నుంచి వైదొలిగిన ఇద్దరి మంత్రుల రాజీనామా పత్రాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం కోసం పంపారు అధికారులు. రాష్ట్రపతి ఆమోదించటంతో వీరిద్దరికి క్యాబినెట్ లో చోటుదక్కింది.
Maharashtra Budget: ‘పంచామృతాల బడ్జెట్’ ప్రవేశ పెట్టిన మహా డిప్యూటీ సీఎం ఫడ్నవీస్
2020లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన అతిషి కల్కాజీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ సిసోడియా ఎడ్యుకేషన్ టీమ్ లో కీలక సభ్యురాలు అయ్యారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్ చేతిలో ఓడిపోయారు. 2013-14లో 49 రోజుల కేజ్రీవాల్ తొలి ప్రభుత్వంలో రవాణా, పర్యావరణ శాఖ మంత్రిగా పనిచేసిన సౌరభ్ భరద్వాజ్ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
Manish Sisodia-Delhi liquor Scam: మనీశ్ సిసోడియాను అరెస్టు చేసిన ఈడీ
ఆప్ జాతీయ అధికార ప్రతినిధి, గ్రేటర్ కైలాష్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న భరద్వాజ్ ఢిల్లీ జలమండలి వైస్ చైర్మన్ హోదాలో యమునా నదిని శుభ్రం చేయడం, ప్రతి ఇంటికీ పైపుల ద్వారా నీటిని తీసుకెళ్లే బాధ్యతను కూడా అప్పగించారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ తమ పదవులకు రాజీనామా చేశారు. గత ఏడాది ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ అరెస్టు తర్వాత ఆయన నిర్వహించిన ఏడు శాఖలను సిసోడియాకు బదిలీ చేశారు. అరెస్టు తర్వాత సిసోడియా మంగళవారం తాను నిర్వహిస్తున్న 18 పదవులకు రాజీనామా చేశారు.
Rajinikanth: సిస్టర్ సెంటిమెంట్‌కే సీనియర్ హీరోల ఓటు.. ఆడియెన్స్ ఏమంటారో?
ఇప్పుడు రద్దు చేసిన వివాదాస్పద ఎక్సైజ్ పాలసీని 2021 లో మహమ్మారి మధ్యలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ కేబినెట్ ఆమోదించింది. ఈ విధానంలో అవినీతి జరిగిందంటూ సీబీఐ కేసు నమోదు చేయడంతో ఆప్ ప్రభుత్వం దాన్ని ఉపసంహరించుకుంది. దర్యాప్తు సంస్థ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ లో సిసోడియాతో పాటు మరో 15 మందిపై కేసు నమోదైంది. ఈ కేసులోనే సిసోడియా అరెస్టు అయ్యారు.