Viral Video: యూపీలో దారుణ ఘటన.. 4 ఏళ్ల చిన్నారిని కిరాతకంగా కుమ్మేసిన ఆంబోతు

హైదరాబాద్ నగరంలో వీధి కుక్కల దాడిలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పయిన అనంతరం, రెండు తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కల మీద పెద్ద చర్చ లేసింది. అయితే కుక్కలే కాదు, జంతువులేవైనా బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తే ప్రమాదమే. దాదాపు చాలా నగరాల్లో వీధుల వెంట ఆంబోతులు కనిపిస్తూనే ఉంటాయి. వాటి పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి

Viral Video: యూపీలో దారుణ ఘటన.. 4 ఏళ్ల చిన్నారిని కిరాతకంగా కుమ్మేసిన ఆంబోతు

Bull gores 4 year-old child in Aligarh

Viral Video: రోడ్డు మీద నిలుచున్న చిన్నారిని ఒక ఆంబోతు దారుణంగా కుమ్మేసింది. అంతటితో ఆగకుండా ఆ చిన్నారి మీదే కూర్చుండిపోయింది. ఇది గమనించిన స్థానికులు ఆంబోతు కింద రక్తపు మడుగులో ఉన్న చిన్నారిని బయటకు తీసి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీగఢ్ పట్టణంలోని తానా గాంధీ పార్క్ సమీపంలో ఉన్న ధనిపూర్ మండిలో జరిగిన దారుణం ఇది. ఈ ఘటన స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది.

YCP MLC Candidates Nominations : ఎమ్మెల్యే కోటా వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు

సీసీటీవీ పుటేజీ ప్రకారం.. నాలుగేళ్ల వయసున్న ఒక చిన్నారి రోడ్డు మీద నిలబడి ఉంది. ఇంతలో గల్లీ వెంట వచ్చిన ఒక ఆంబోతు.. మరో ఆంబోతుతో పొట్లాటకు వెళ్లినట్టుగా కాలు దువ్వి, మెడలు విరుస్తూ.. చిన్నారిని ఒక్క ఉదుటన కుమ్మేసింది. ఆంబోతు ధాటికి చిన్నారి ఎగిరిపడి స్పృహ తప్పిపోయింది. అనంతరం ఆ ఆంబోతు చిన్నారి మీదే కూర్చుంది. వెంటనే ఇంట్లో నుంచి ఒక వ్యక్తి వచ్చి ఆంబోతు కింద ఉన్న చిన్నారిని బయటికి తీశాడు. అనంతరం చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం చిన్నారి విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఘటన అనంతరం మున్సిపల్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఆంబోతును బంధించి తీసుకెళ్లారు. ఆ ప్రాంతంలో ఆంబోతులు విచ్చలవిడిగా తీరుగుతున్నాయని అనేక రోజుల నుంచి ఫిర్యాదు చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు.

హైదరాబాద్ నగరంలో వీధి కుక్కల దాడిలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పయిన అనంతరం, రెండు తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కల మీద పెద్ద చర్చ లేసింది. అయితే కుక్కలే కాదు, జంతువులేవైనా బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తే ప్రమాదమే. దాదాపు చాలా నగరాల్లో వీధుల వెంట ఆంబోతులు కనిపిస్తూనే ఉంటాయి. వాటి పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు ఎటువైపు నుంచి వస్తున్నాయి, ఏ రూపంలో వస్తున్నాయో ఊహించలేని పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి విడిచిపెట్టకూడదు. అలాగే జంతువులు వీధుల్లో స్వైర విహారం చేస్తూ కనిపిస్తే పట్టణాల్లో అయితే మున్సిపల్ సిబ్బందికి గాని, గ్రామాల్లో అయితే పంచాయితీ సిబ్బందికి గాని వెంటనే సమాచారం అందించండి.

Spain Court : మాజీ భార్యకు రూ.1.75 కోట్లు చెల్లించాలని.. వ్యక్తిని ఆదేశించిన స్పెయిన్‌ కోర్టు