Spain Court : మాజీ భార్యకు రూ.1.75 కోట్లు చెల్లించాలని.. వ్యక్తిని ఆదేశించిన స్పెయిన్‌ కోర్టు

స్పెయిన్‌లో ఒక వ్యక్తికి తన మాజీ భార్యకు రూ.1.75 కోట్లు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. వారి వివాహ సమయంలో రెండు దశాబ్దాలుగా ‘చెల్లించని ఇంటి పనికి’ పరిహారంగా దాదాపు రూ.1.75 కోట్లు ఆమెకు చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

Spain Court : మాజీ భార్యకు రూ.1.75 కోట్లు చెల్లించాలని.. వ్యక్తిని ఆదేశించిన స్పెయిన్‌ కోర్టు

spain

Spain Court : స్పెయిన్‌లో ఒక వ్యక్తికి తన మాజీ భార్యకు రూ.1.75 కోట్లు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. వారి వివాహ సమయంలో రెండు దశాబ్దాలుగా ‘చెల్లించని ఇంటి పనికి’ పరిహారంగా దాదాపు రూ.1.75 కోట్లు ఆమెకు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. దంపతుల వివాహ కాలంలో వార్షిక కనీస వేతనం ఆధారంగా భారీ విడాకుల సెటిల్‌మెంట్ పరిగణనలోకి తీసుకున్నట్లు న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. వివాహ జీవిత సమయంలో భార్య ఇవానా మోరల్‌ చేసిన 25 సంవత్సరాల సేవకుగానూ ఆమెకు రూ.1.75 కోట్లు పరిహారంగా ఇవ్వాలని న్యాయమూర్తి లారా రూయిజ్ అలమినోస్ ఆమె మాజీ భర్తను ఆదేశించారు.

ఈ జంట 1995 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. 2020లో విడాకులు తీసుకున్నారు. భార్యకు నెలవారీ భరణంగా రూ.527, 20 మరియు 14 సంవత్సరాల వయస్సు గల దంపతుల ఇద్దరు కుమార్తెలకు 422 డాలర్లు, డాలర్లు 633 చెల్లించాలని ఆ వ్యక్తిని కోర్టు ఆదేశించింది. తన కష్టాలను మోరల్ నివేదికలో పేర్కొన్నారు. మోరల్ దంపతులు విడాకులు తీసుకున్నప్పుడు ఆమె, వారి కుమార్తెలు ఎలాంటి ఆస్తి లేకుండా మిగిలిపోయారని వాపోయారు. తన మాజీ భర్త సంపాదనను మిగిల్చకుండా దుర్వినియోగం చేశారని పేర్కొన్నారు.

తాను కుటుంబం, ఇంటి పనులే చూసుకున్నానని, ఆర్థిక అంశాలలో తనకు ఎలాంటి ప్రమేయం లేదని పేర్కొన్నారు. అంతేకాకుండా తన మాజీ భర్తకు అతను చేసే పనిలో మద్దతుగా నిలిచానని, కానీ అతని ఆర్థిక వ్యవహారాలను పట్టించుకోలేదని చెప్పారు. ప్రతిదీ తన మాజీ భర్త పేరు మీదనే ఉందని తెలిపారు. తాము పెళ్లి చేసుకునే సమయంలో వస్తువుల విభజన ఒప్పందంపై సంతకం చేయమని మాజీ భర్తను ఆమె కోరారు. మాజీ భర్త తన సంపదను ఉంచుకోవడానికి మరియు వారి ఉమ్మడి ఆస్తులను విభజించడానికి అనుమతించినట్లు ఆమె పేర్కొన్నారు.

కాగా, విజయవంతంగా నడిచే జిమ్ వ్యాపారంతో అనేక విలాసవంతమైన ఆస్తులను అతను కలిగి ఉన్నట్లు, వీటి విలువ 6.4 మిలియన్లు డాలర్లుగా ఉన్నట్లు దక్షిణ స్పెయిన్‌లోని వెలెజ్-మలాగాలోని కోర్టు విచారణలో వెల్లడైంది. ఇతర మహిళలకు ఈ కేసు ఒక ఉదాహరణ, ప్రేరణగా ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. వస్తువుల విభజన ఒప్పందాలు ఉన్నప్పటికీ ఇంటి పనుల కోసం క్లెయిమ్ చేయవచ్చని తెలుసుకోవాలని తెలిపారు.