అయోధ్య శ్రీరామ మందిర భూమిపూజ కోసం లక్షా 11వేల లడ్డూలు

  • Publish Date - July 31, 2020 / 03:17 PM IST

ఆగస్టు 5న అంటే కేవలం మరో ఐదురోజుల్లో అయోధ్యలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కారం కాబోతోంది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రామ మందిరం నిర్మాణం పనుల కోసం ఆగస్టు 5న భూమి పూజ చేయనున్నారు. దీని కోసం ఏర్పాట్లు శరవేగంగా జరిగిపోతున్నాయి. భూమి పూజ సందర్భంగా భారీ ఎత్తున లడ్డూలు కూడా తయారు చేయిస్తున్నారు. 1లక్షా 11వేల లడ్డూలను భక్తుల కోసం సిద్ధం చేస్తున్నారు. మణిరామ్ దాస్ కంటోన్మెంట్..రాందాస్ చావ్నీలో లడ్డూల తయారీ ప్రక్రియ కొనసాగుతోంది.



స్వచ్ఛమైన ఆవునెయ్యితో తయారు చేసిన ఈ లడ్డూలను ప్రత్యేక టిఫిన్ బాక్సుల్లో భద్రపరుస్తున్నారు. ఈ లడ్డూలను అయోధ్యతో పాటు వివిధ తీర్థయాత్రల్లో భక్తులకు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భూమి పూజ జరిగే రోజున టైం స్క్వేర్‌లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జై శ్రీరాం అంటూ హిందీ, ఇంగ్లీషు బాషల్లో పౌరాణిక ప్రదర్శన నిర్వహించనున్నారు.



ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ శంకుస్థాపన జరుగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆయోధ్యలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. 200 మంది వరకు ప్రముఖులు ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొననున్నారు.

ట్రెండింగ్ వార్తలు