Ayushman Bharat Card : ఆయుష్మాన్ భారత్ కార్డుతో కొవిడ్ ట్రీట్‌మెంట్.. రూ. 5 లక్షల వరకు ఫ్రీ.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి!

Ayushman Bharat Card

Ayushman Bharat Card : దేశంలో కరోనా కేసుల ఉధృతి పెరిగిపోతోంది. కరోనా బారినపడి ఆస్పత్రుల్లో చేరితే వైద్యపరంగా ఖర్చులను భరించాల్సి వస్తుంది. ఆర్థికంగా బలహీన వర్గాలు పెద్ద మొత్తంలో వైద్యం చేయించుకోలేని పరిస్థితి.

Read Also : Covid-19 Cases : భారత్‌లో కరోనా కల్లోలం.. 2,710కి పెరిగిన కేసులు.. 7 మరణాలు.. కేరళలోనే అత్యధికం..!

ఇలాంటి వారి కోసం ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (PM-JAY)కింద ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ కార్డును ప్రవేశపెట్టింది. తద్వారా ఉచిత ఆరోగ్య సేవలను పొందవచ్చు. ఈ పథకం కింద రూ. 5 లక్షల వరకు ఆరోగ్య కవరేజీని అందిస్తుంది.

ఇటీవల ఢిల్లీతో సహా అనేక రాష్ట్రాల్లో ఆయుష్మాన్ భారత్ విస్తరించింది ప్రభుత్వం. కొన్ని రాష్ట్రాల్లో ఈ మొత్తం రూ. 10 లక్షలకు కూడా చేరుకుంది. ప్రతి పేదవాడికి మెరుగైన ఆరోగ్య సేవలను అందించడమే భారత ప్రభుత్వం లక్ష్యం.

ప్రస్తుతం కరోనా తీవ్రమవుతున్న పరిస్థితుల్లో అర్హత కలిగిన ప్రతిఒక్కరూ తప్పనిసరిగా ఆయుష్మాన్ భారత్ కార్డు కోసం అప్లయ్ చేసుకోవాలి. కరోనా బారినపడ్డ బాధితులకు రూ. 5 లక్షల వరకు ట్రీట్‌మెంట్ ఉచితంగా పొందవచ్చు.

ఆయుష్మాన్ కార్డుతో కరోనాకు ట్రీట్‌మెంట్? :
కరోనావైరస్ తీవ్రమైన కేసులకు, ఆయుష్మాన్ భారత్ యోజన కింద ట్రీట్‌మెంట్ పొందవచ్చు. మొదటి వేవ్ సమయంలో కూడా పెద్ద సంఖ్యలో ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు.

సాధారణ పరీక్షల కోసం లేదా OPDలో మాత్రమే చికిత్స పొందితే ఈ పథకం ప్రయోజనం లభించదు. ఆసుపత్రిలో చేరిన రోగులు మాత్రమే ఈ పథకం కింద ప్రయోజనం పొందవచ్చు.

ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ లేదా ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ (ESI) ఉన్నవారు కూడా ఈ పథకం ప్రయోజనాన్ని పొందవచ్చు. చికిత్స కోసం ఆస్పత్రిని PM-JAY నెట్‌వర్క్‌లో చేర్చాలి. ఆస్పత్రిలో చేరిన కేసులలో మాత్రమే ప్రయోజనం పొందవచ్చు.

ఆయుష్మాన్ భారత్ కార్డును ఎవరు పొందవచ్చు? :

  • ఈ పథకం ప్రత్యేకంగా వీరికి మాత్రమే వర్తిస్తుంది:
  • ఆదాయం నిర్దిష్ట పరిమితి కన్నా తక్కువగా ఉన్న కుటుంబాలు.
  • షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సభ్యులు.
  • రోజువారీ వేతనాలపై ఆధారపడే వారు.
  • శాశ్వత నివాసం లేని వారు.

అర్హులో కాదో ఎలా చెక్ చేయాలి? :

  • మీ అర్హతను ఆన్‌లైన్‌లో ఈజీగా చెక్ చేసుకోవచ్చు.
  • అధికారిక వెబ్‌సైట్ (https://pmjay.gov.in)ని విజిట్ చేయండి.
  • ‘Am I Eligible’ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • మీ మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి.
  • OTP జనరేట్ చేసి ఎంటర్ చేయండి.
  • ఫారమ్‌లో మీ పేరు, రాష్ట్రం, వయస్సు, కుటుంబ సమాచారం, ఆదాయం వివరాలను ఇవ్వండి.
  • ఈ పథకానికి అర్హులో కాదో తెలుసుకోవచ్చు.

కార్డు కోసం ఎలా అప్లయ్ చేయాలి? :

  • మీరు అర్హులైతే, ఆన్‌లైన్ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు.
  • ఇందుకోసం (https://pmjay.gov.in) వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.
  • రిజిస్ట్రేషన్ ఫారమ్ నింపి అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.
  • మీ మొబైల్‌లో ‘ఆయుష్మాన్ భారత్ యాప్’ డౌన్‌లోడ్ చేసి నేరుగా అప్లయ్ చేసుకోవచ్చు.

Read Also : COVID-19 Cases : ఏలూరులో కరోనా ఉధృతి.. కలెక్టరేట్‌‌లో నలుగురు ఉద్యోగులకు పాజిటివ్..

అవసరమైన డాక్యుమెంట్లు :

  • ఆధార్ కార్డు
  • రేషన్ కార్డు
  • నివాస ధృవీకరణ పత్రం
  • ఆదాయ ధృవీకరణ పత్రం
  • మొబైల్ నంబర్
  • పాస్‌పోర్ట్ సైజు ఫొటో