COVID-19 Cases : ఏలూరులో కరోనా ఉధృతి.. కలెక్టరేట్‌‌లో నలుగురు ఉద్యోగులకు పాజిటివ్..

COVID-19 Cases : ఏలూరులో కరోనా కేసుల ఉధృతి పెరుగుతోంది. జిల్లా కలెక్టరేట్‌లో నలుగురికి పాజిటివ్ వచ్చింది.

COVID-19 Cases : ఏలూరులో కరోనా ఉధృతి.. కలెక్టరేట్‌‌లో నలుగురు ఉద్యోగులకు పాజిటివ్..

COVID cases

Updated On : May 31, 2025 / 6:04 PM IST

COVID-19 Cases : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకీ కేసుల తీవ్రత పెరుగుతోంది. ఏలూరులో కరోనా కేసులు పెరుగుతున్నాయి.

Read Also : IRCTC AskDISHA 2.0 : రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై ట్రైన్ టికెట్ బుకింగ్ చాలా ఈజీ.. రీఫండ్ స్టేటస్ చెకింగ్ కూడా..!

జిల్లా కలెక్టరేట్లో నలుగురు ఉద్యోగులకు కోవిడ్ పాజిటివ్ ‌గా తేలింది. పీజీఆర్ఎస్ కాల్ సెంటర్ టీంలోని నలుగురు ఉద్యోగులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

తొలుత ఒక ఉద్యోగికి పాజిటివ్ రాగా కలెక్టరేట్‌లోని అన్ని శాఖల అధికారులకు, ఉద్యోగులకు వైద్య ఆరోగ్యశాఖ కోవిడ్ పరీక్షలు చేసింది.

మొత్తం నలుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దాంతో కలెక్టరేట్ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. మొత్తంగా ఏలూరులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆరుకు చేరింది.

కరోనా కేసుల తీవ్రత పెరగడంతో ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

Read Also : Covid-19 Cases : భారత్‌లో కరోనా కల్లోలం.. 2,710కి పెరిగిన కేసులు.. 7 మరణాలు.. కేరళలోనే అత్యధికం..!

ఏదైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ పాజిటివ్ అని తేలితే ఐసోలేషన్ అయి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు.