Covid-19 Cases : భారత్‌లో కరోనా కల్లోలం.. 2,710కి పెరిగిన కేసులు.. 7 మరణాలు.. కేరళలోనే అత్యధికం..!
Covid-19 Cases : భారత్‌లో కోవిడ్-19 కేసులు 2,710కి పెరిగాయి. 7 కరోనా మరణాలు నమోదయ్యాయి. ఎక్కువగా కోమోర్బిడిటీలే ఉన్నారు.

Covid 19 Cases
Covid-19 Cases : భారత్‌లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకీ కోవిడ్ కేసులు పెరుగుతూ పోతున్నాయి. దేశంలో ఇప్పటివరకూ యాక్టివ్ కోవిడ్-19 కేసులు 2,710కి చేరుకున్నాయి.
రాష్ట్రాల వారీగా మొత్తం 7 మరణాలు నమోదయ్యాయి. వీరిలో ఎక్కువగా కోమోర్బిడిటీల (తీవ్ర అనారోగ్య సమస్యలు) కారణంగానే మృతిచెందినట్టు తెలుస్తోంది.
ప్రత్యేకించి కేరళలో అత్యధిక యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, కరోనా బారిన పడిన 1,170 మంది డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రాష్ట్రాల వారీ డేటా ప్రకారం.. కోమోర్బిడిటీలే ఎక్కువగా కరోనా బారిన పడి మృతిచెందినట్టు సమాచారం.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఢిల్లీలో ఒకరు మరణించారు. లాపరోటమీ తర్వాత పేగు వ్యాధితో 60 ఏళ్ల మహిళ మృతిచెందింది. గుజరాత్లో ఒక మరణం నమోదైంది. కర్ణాటకలో ఒక మరణం నమోదు కాగా కార్డియోరెస్పిరేటరీ అరెస్ట్ అని తేలింది.
ఎన్సెఫలోపతి, రక్తహీనత, థ్రోంబోసైటోపీనియా, డయాబెటిస్ మెల్లిటస్ (DM), హైపర్‌టెన్షన్ (HTN), ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ (IHD) వంటి కోమోర్బిడిటీలతో 70 ఏళ్ల వృద్ధుడు మరణించాడు. అయితే, కరోనా పరీక్ష నిర్ధారణ కావాల్సి ఉంది.
కోమోర్బిడిటీలతో కరోనా మరణాలు :
మహారాష్ట్రలో రెండు మరణాలు సంభవించాయి. అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ARDS), ఊపిరితిత్తుల న్యుమోనియా, కోవిడ్-19 RT-PCR పాజిటివ్, DM, HTN, సెరెబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ (CVA) వంటి కోమోర్బిడిటీలతో అనేక మంది మరణించారు. 67 ఏళ్ల వృద్ధుడు డయాబెటిక్ కీటోయాసిడోసిస్ (DKA), లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (LRTI) కలిగిన 21 ఏళ్ల యువకుడు మరణించారు.
హెపటైటిస్ బి, అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్‌తో 39 ఏళ్ల వ్యక్తి పంజాబ్‌లో మరణించగా, తమిళనాడులో టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్ (T2DM), రక్తపోటు (HTN), దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (CKD) ఉన్న 60 ఏళ్ల వృద్ధుడు మరణించాడు.
కేరళలోనే అత్యధిక కేసులు :
కేరళలో 1,147 యాక్టివ్ కేసులతో అగ్రస్థానంలో ఉంది. మరణాల వివరాలు వెల్లడి కాలేదు. బిహార్‌లో రోజువారీ కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయి. అధికారులు ప్రస్తుత పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
కేంద్రం ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉందని కేంద్ర ఆరోగ్య, ఆయుష్ సహాయ మంత్రి ప్రతాప్రరావు జాదవ్ పేర్కొన్నారు.
‘కేంద్ర ఆరోగ్య శాఖ, ఆయుష్ మంత్రిత్వ శాఖ అప్రమత్తంగా ఉన్నాయి. అన్ని రాష్ట్రాలలో కరోనా కేసుల తీవ్రతను నిశితంగా పర్యవేక్షిస్తున్నాం’ అని జాదవ్ చెప్పారు.
గత కోవిడ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ ప్లాంట్లు, ఐసీయూ పడకలు వంటివి సమీక్షించినట్టు ఆయన తెలిపారు. ఎలాంటి తీవ్ర పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు.