New Rules : జూన్ 1 నుంచి కొత్త రూల్స్.. క్రెడిట్ కార్డు నుంచి ఆధార్ అప్‌డేట్ వరకు.. 5 ముఖ్యమైన మార్పులివే..!
New Rules : వచ్చే జూన్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. క్రెడిట్ కార్డు నుంచి ఆధార్ కార్డు వరకు 5 ముఖ్యమైన విషయాలివే..

New Rules
New Rules : ఆర్థిక లావాదేవీలు చేసేవారికి అలర్ట్.. జూన్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. రోజువారీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన మార్పులు తప్పక తెలుసుకోవాలి.
ఇందులో కొత్త క్రెడిట్ కార్డ్ రూల్స్ నుంచి ఫ్రీ ఆధార్ అప్‌డేట్ గడువు వరకు మార్పులు ఉండనున్నాయి. అవేంటో ఓసారి వివరంగా తెలుసుకుందాం.
1. క్రెడిట్ కార్డ్‌పై కొత్త రూల్స్ :
క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు బిగ్ అలర్ట్.. జూన్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. పవర్ లేదా వాటర్ బిల్లులు వంటి యుటిలిటీ బిల్లులను చెల్లించడానికి మీ క్రెడిట్ కార్డును వాడితే అదనపు ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది.
కోటక్ మహీంద్రా బ్యాంక్ నెలవారీ పరిమితిని మించి ఫ్యూయల్ చెల్లింపుపై 1 శాతం ఛార్జీని విధిస్తుంది. అద్దె, యుటిలిటీ బిల్లులు, ఇన్సూరెన్స్ వంటి వస్తువులపై కూడా రివార్డ్ పాయింట్లను పరిమితం చేయనుంది.
మీ ఆటో-డెబిట్ పేమెంట్ ఫెయిల్ అయితే జరిమానా 2 శాతానికి తగ్గవచ్చు. మునుపటి కన్నా తక్కువ ఉండొచ్చు. అంతర్జాతీయ లావాదేవీ రుసుములు, రివార్డ్ పాయింట్లలో మార్పులకు సంబంధించి తెలుసుకోండి. మీ బ్యాంకును సంప్రదించి వివరాలను ధృవీకరించండి.
2. ఏటీఎం ఛార్జీలు :
మీరు ఏటీఎంలపై ఎక్కువగా ఆధారపడితే.. రుసుము ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 1 నుంచి బ్యాంక్ ఫ్రీ లిమిట్ దాటి డబ్బును విత్‌డ్రా చేస్తే మరిన్ని ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
ప్రతి బ్యాంకుకు ఛార్జీలపై ప్రత్యేక నియంత్రణ ఉంటుంది. పరిమితికి మించి విత్‌డ్రాకు ఎంత ఛార్జ్ పడుతుందో వెబ్‌సైట్ లేదా యాప్‌లో చెక్ చేయొచ్చు.
3. LPG సిలిండర్ ధరలు :
దేశీయ LPG సిలిండర్ ధరలు జూన్ 1న మారనున్నాయి. చమురు కంపెనీలు, మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ధరలను పెంచడం లేదా తగ్గించడం చేయొచ్చు.
4. ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు తగ్గింపు :
మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో (FD) డబ్బు సేవ్ చేస్తుంటే.. కొన్ని బ్యాంకులు జూన్ 1 నుంచి FD వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. ఉదాహరణకు.. సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రేట్లను 60 బేసిస్ పాయింట్ల వరకు తగ్గిస్తోంది.
ప్రస్తుతం, FD రేట్లు 6.5 శాతం నుంచి 7.5 శాతం మధ్య ఉన్నాయి. కానీ, ఆర్బీఐ విధానాలు, మార్కెట్ పరిస్థితుల ఆధారంగా మారవచ్చు.
5. ఫ్రీ ఆధార్ అప్‌డేట్స్ :
మీ ఆధార్ డేటాను అప్‌డేట్ చేస్తే ఇప్పుడే చేయండి. (myAadhaar)పోర్టల్‌లో ఉచితంగా అప్‌డేట్ చేసేందుకు చివరి తేదీ జూన్ 14, 2025 వరకు సమయం ఉంది.
ఆ తేదీ తర్వాత ఆన్‌లైన్ ఆధార్‌ను అప్‌డేట్ చేస్తే రూ. 25, ఆధార్ సెంటర్లలో అప్‌డేట్ చేస్తే రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది.
క్రెడిట్ కార్డ్, ఏటీఎం ఛార్జీలకు సంబంధించిన అప్‌డేట్‌ల కోసం మీ బ్యాంక్ వెబ్‌సైట్ లేదా యాప్‌ను చెక్ చేయండి. లేటెస్ట్ ఆర్బీఐ నిబంధనల కోసం (https://www.rbi.org.in)ని విజిట్ చేయండి.