WhatsApp : అలర్ట్.. జూన్ 1 నుంచి ఈ ఐఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి!

WhatsApp : వచ్చే జూన్ 1 నుంచి కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లు, ఐఫోన్లలో వాట్సాప్ సర్వీసులు పూర్తిగి నిలిచిపోనున్నాయి. ఫుల్ లిస్టు ఓసారి చెక్ చేసుకోండి.

WhatsApp : అలర్ట్.. జూన్ 1 నుంచి ఈ ఐఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి!

WhatsApp

Updated On : May 31, 2025 / 5:02 PM IST

WhatsApp : వాట్సాప్ యూజర్లకు బిగ్ అలర్ట్.. జూన్ 1 నుంచి వాట్సాప్ సర్వీసులు నిలిచిపోనున్నాయి. అన్ని ఫోన్లలో కాదు.. కొన్నింటిలో మాత్రమే.. అందులో ఆపిల్ ఐఫోన్ల నుంచి ఆండ్రాయిడ్ ఫోన్ల వరకు చాలా మోడల్స్ ఉన్నాయి.

Read Also : OnePlus Nord 5 Launch : కొత్త వన్‌ప్లస్ ఫోన్ వచ్చేస్తోందోచ్.. కెమెరా ఫీచర్లు మాత్రం సూపర్.. ధర ఎంత ఉండొచ్చంటే?

చాలావరకూ పాత ఐఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ సపోర్టు పూర్తిగా నిలిచిపోనుంది. వాట్సాప్ కొత్త అప్‌డేట్‌లో భాగంగా సపోర్టు చేయని పాత మోడల్స్ జాబితాను విడుదల చేసింది. ఈ మోడల్ ఫోన్లు కలిగిన వినియోగదారులు వెంటనే అప్‌గ్రేడ్ చేసుకోవాలి. లేదంటే వాట్సాప్ సర్వీసులను వినియోగించుకోలేరు.

వాట్సాప్ సపోర్టు చేయని ఫోన్ల ఫుల్ లిస్ట్ ఇదిగో :
ఆపిల్ ఐఫోన్లు జూన్ 1 నుంచి వాట్సాప్ సపోర్టు ఇవ్వవు. ఐఫోన్ 5s, ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్, ఐఫోన్ 6s, ఐఫోన్ 6s ప్లస్, ఫస్ట్ జనరేషన్ ఐఫోన్ SE మోడల్స్ ఉన్నాయి.

ఆండ్రాయిడ్ ఫోన్లలో శాంసంగ్ గెలాక్సీ S4, శాంసంగ్ గెలాక్సీ నోట్ 3, సోనీ Xperia Z1, ఎల్‌జీ G2, హువావే అసెండ్ P6, మోటో G ఫస్ట్ జనరేషన్, మోటోరోలా రెజర్ HD, మోటో E (2014) వంటి మోడల్స్ ఉన్నాయి.

ఈ ఫోన్లు ఇకపై లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్‌లు అందుకోవు. వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్‌కు కూడా సపోర్టు చేయవు.

మెటా ప్రకారం.. ఈ అప్‌డేట్ సపోర్టు అందించే ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్‌లకు అందిస్తుంది. జూన్ 1 నుంచి iOS 15 లేదా అంతకన్నా ముందు వెర్షన్‌పై రన్ అయ్యే ఐఫోన్లతో పాటు ఆండ్రాయిడ్ 5.0 లేదా అంతకంటే పాత వెర్షన్ రన్ అయ్యే ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ ఇకపై సర్వీసులు నిలిచిపోనున్నాయి.

ఈ పాత వెర్షన్‌లోని వాట్సాప్ యూజర్లు ఆపరేటింగ్ సిస్టమ్‌ లేదా ఫోన్‌లను అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. కొత్త ఫోన్ ఎక్స్ఛేంజ్ సమయంలో ఈజీగా డేటా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

చాట్ హిస్టరీని కూడా గూగుల్ అకౌంట్‌కు బ్యాకప్ చేసుకోవాలని వాట్సాప్ సూచిస్తోంది. వాట్సాప్ యూజర్లు వాట్సాప్ ఓపెన్ చేసి (Settings) సెలక్ట్ చేసి Chatపై ట్యాప్ చేయాలి.

Read Also : Motorola G Series : మోటోరోలా ఫ్యాన్స్‌కు పండగే.. పిచ్చెక్కించే ఫీచర్లతో 3 కొత్త మోటోరోలా G సిరీస్ ఫోన్లు.. ధర ఎంతంటే? 

ఆపై చాట్ బ్యాకప్‌ను ఎంచుకోవచ్చు. పాత ఫోన్‌లు ఇకపై సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ పొందవు. ఇలాంటి డివైజ్‌లలో హ్యాకింగ్, సైబర్ అటాక్స్ రిస్క్ పెరిగే అవకాశం ఉంటుంది.