Motorola G Series : మోటోరోలా ఫ్యాన్స్‌కు పండగే.. పిచ్చెక్కించే ఫీచర్లతో 3 కొత్త మోటోరోలా G సిరీస్ ఫోన్లు.. ధర ఎంతంటే?
Motorola G Series : మోటోరోలా నుంచి మూడు సరికొత్త G సిరీస్ ఫోన్లు లాంచ్ అయ్యాయి.. ఆండ్రాయిడ్ 15తో ఈ మోటో G ఫోన్ల ఫీచర్లు, ధర వివరాలివే

Motorola G Series
Motorola G Series : మోటోరోలా అభిమానులకు గుడ్ న్యూస్.. మోటోరోలా నుంచి మూడు సరికొత్త మోడల్ ఫోన్లు వచ్చేశాయి. మోటోరోలా G-సిరీస్ లైనప్‌ను మోటరోలా G86, G86 పవర్, మోటోరోలా G56 స్మార్ట్‌ఫోన్‌లతో విస్తరించింది.
ఈ కొత్త మోడళ్లు ప్రీమియం డిజైన్, పవర్‌ఫుల్ ఇంటర్నల్, లేటెస్ట్ సాఫ్ట్‌వేర్, మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో రిలీజ్ అయ్యాయి. ఈ మోటో ఫోన్ల ధర GBP 199.99 (సుమారు రూ. 22,900) నుంచి లభ్యమవుతాయి. మూడు ఫోన్ల ధరలు, ఫీచర్ల వివరాలు ఎలా ఉన్నాయో ఓసారి లుక్కేయండి.
మోటో G86, మోటో G86 పవర్ :
మోటోరోలా G86, మోటోరోలా G86 పవర్ రెండూ 6.67-అంగుళాల సూపర్ HD అమోల్డ్ డిస్‌ప్లే, 2,712×1,220 పిక్సెల్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ కలిగి ఉన్నాయి.
డిస్‌ప్లే విషయానికి వస్తే.. HDR10+ సర్టిఫికేషన్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, వైడ్ రేంజ్ DCI-P3 కలర్ గామట్‌ను అందిస్తాయి. మీడియాటెక్ డైమన్షిటీ 7300 చిప్‌సెట్‌తో రన్ అయ్యే మోటో G86 8GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో వస్తుంది.
అయితే, మోటో G86 పవర్ 12GB ర్యామ్, 512GB స్టోరేజ్‌తో వస్తుంది. ఈ రెండు ఫోన్‌లు ఆండ్రాయిడ్ 15పై రన్ అవుతాయి. మిలిటరీ-గ్రేడ్ ఆప్షన్ MIL-STD 810H సర్టిఫికేట్ పొందాయి. కెమెరా విషయానికొస్తే.. ఈ ఫోన్లు డ్యూయల్ రియర్ సెటప్‌తో వస్తాయి.
ఇందులో 50MP సోనీ LYT-600 ప్రైమరీ సెన్సార్, OIS, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. 32MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్ చేసుకోవచ్చు.
ఇందులో తేడా ఏంటంటే.. బ్యాటరీ కెపాసిటీ మాత్రమే. మోటో G86 ఫోన్ 5,200mAh బ్యాటరీ కలిగి ఉంది. పవర్ మోడల్ భారీ 6,720mAh యూనిట్‌ను అందిస్తుంది. ఈ రెండూ 30W టర్బోపవర్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తాయి.
మోటోరోలా G56 (Motorola G Series) :
మోటోరోలా G56 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.72-అంగుళాల FHD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమన్షిటీ 7060 SoC ద్వారా 256GB ఇంటర్నల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 15 అవుట్ ఆఫ్ బాక్స్‌తో వస్తుంది.
ఇతర మోటో ఫోన్ల మాదిరిగానే 50MP డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్, 32MP ఫ్రంట్ కెమెరాను అందిస్తుంది. మోటో G56 30W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,200mAh బ్యాటరీని కలిగి ఉంది. మైక్రో SD కార్డ్ ద్వారా 2TB వరకు స్టోరేజీని విస్తరించుకోవచ్చు.
ధర వివరాలు :
మోటో G56 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ సుమారు రూ. 22,900
మోటో G86 : సుమారు రూ. 32,200
మోటో G86 పవర్ : సుమారు రూ. 34,500
ఈ 3 మోడళ్లు మోటోరోలా యూకే వెబ్‌సైట్‌లో అనేక పాంటోన్-వెరిఫైడ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి.