OnePlus Nord 5 Launch : కొత్త వన్‌ప్లస్ ఫోన్ వచ్చేస్తోందోచ్.. కెమెరా ఫీచర్లు మాత్రం సూపర్.. ధర ఎంత ఉండొచ్చంటే?
OnePlus Nord 5 Launch : అదిరిపోయే ఫీచర్లతో కొత్త వన్‌ప్లస్ నార్డ్ 5 ఫోన్ వచ్చేస్తోంది. కెమెరా, బ్యాటరీ, ధరకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

OnePlus Nord 5 Launch
OnePlus Nord 5 Launch : కొత్త వన్‌ప్లస్ కోసం చూస్తున్నారా? అతి త్వరలో వన్‌ప్లస్ నార్డ్ 5 ఫోన్ లాంచ్ కానుంది. భారత మార్కెట్లో వన్‌ప్లస్ 13s లాంచ్ తర్వాత వన్‌ప్లస్ నార్డ్ 5 ఫోన్ (OnePlus Nord 5 Launch) ప్రపంచ మార్కెట్లలో లాంచ్ చేసేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది.
ఈ ఫోన్ వన్‌ప్లస్ నార్డ్ 4 అప్‌గ్రేడ్ వెర్షన్‌గా రాబోతుంది. ఆకర్షణీయమైన డిజైన్, హార్డ్‌వేర్, ఫీచర్లు, కెమెరాను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.
ఈ వన్‌ప్లస్ ఫోన్ గ్లాస్ బ్యాక్‌తో ప్లాస్టిక్ ఫ్రేమ్‌తో వస్తుందని అంచనా. డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కూడా కలిగి ఉండొచ్చు. ఈ వన్‌ప్లస్ ఫోన్ స్పెసిఫికేషన్లు, ధర, డిజైన్ లీకుల వివరాలు ఇలా ఉన్నాయి.
వన్‌ప్లస్ నార్డ్ 5 లాంచ్ టైమ్‌లైన్ :
ప్రస్తుతానికి వన్‌ప్లస్ నార్డ్ 5 లాంచ్ తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. నివేదికల ప్రకారం.. వన్‌ప్లస్ నార్డ్ 5 వచ్చే జూలైలో లాంచ్ కావచ్చు. వన్‌ప్లస్ నార్డ్ 5తో వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5 లాంచ్ కావచ్చని సూచిస్తున్నాయి.
వన్‌ప్లస్ నార్డ్ 5 స్పెసిఫికేషన్లు (అంచనా) :
వన్‌ప్లస్ నార్డ్ 5 ఫోన్ 6.77-అంగుళాల 1.5K రిజల్యూషన్ ఫ్లాట్ OLED ప్యానెల్‌తో 120hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుందని అంచనా. మీడియాటెక్ డైమన్షిటీ 9400e చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. డైమన్షిటీ 9400 చిప్‌సెట్ టోన్-డౌన్ వెర్షన్. భారీ 6,700mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌ను కలిగి ఉంటుంది.
బాక్స్ వెలుపల ఆండ్రాయిడ్ 15తో రావచ్చు. కెమెరా విషయానికొస్తే.. ఈ వన్‌ప్లస్ ఫోన్ OISతో 50MP ప్రైమరీ షూటర్, 8MP అల్ట్రావైడ్ సెన్సార్‌తో డ్యూయల్ కెమెరా సెటప్‌ను అందించవచ్చు. ఈ వన్‌ప్లస్ 16MP ఫ్రంట్ కెమెరాను కూడా కలిగి ఉండొచ్చు.
Read Also : Apple Store : గుడ్ న్యూస్.. భారత్‌లో త్వరలో మూడో ఆపిల్ స్టోర్.. ఎక్కడో తెలుసా? అద్దె రూ. 2.9 కోట్లు అంట..!
భారత్‌లో వన్‌ప్లస్ నార్డ్ 5 ధర (అంచనా) :
లేటెస్ట్ రిపోర్టు ప్రకారం.. వన్‌ప్లస్ నార్డ్ 5 ధర భారత మార్కెట్లో రూ.30వేల నుంచి రూ.35వేల మధ్య ఉండవచ్చు. అయితే, ఈ వన్‌ప్లస్ వివరాలు ఇంకా రివీల్ చేయలేదు.