Vivo X200 FE : వారెవ్వా.. వివో కొత్త ఫోన్ అదుర్స్.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు, ధర లీక్.. ఫుల్ డిటెయిల్స్..!

Vivo X200 FE : అదిరిపోయే ఫీచర్లతో వివో కొత్త X200 FE ఫోన్ వచ్చేస్తోంది. లాంచ్ కు ముందుగానే కీలక ఫీచర్లు, ధర వివరాలు లీక్ అయ్యాయి.

Vivo X200 FE : వారెవ్వా.. వివో కొత్త ఫోన్ అదుర్స్.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు, ధర లీక్.. ఫుల్ డిటెయిల్స్..!

Vivo X200 FE

Updated On : May 30, 2025 / 4:02 PM IST

Vivo X200 FE : కొత్త వివో ఫోన్ వచ్చేస్తోంది. భారత మార్కెట్లో వివో X200 FE లాంచ్ కానుంది. చైనీస్ స్మార్ట్‌ఫోన్ (Vivo X200 FE) తయారీదారు కొత్త X200FE వెర్షన్‌‌ను వివో X200 సిరీస్‌ పేరుతో లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది.

Read Also : Vivo S30 Series : వివో S30 సిరీస్ వచ్చేసిందోచ్.. అద్భుతమైన ఫీచర్లు.. మొత్తం 2 ఫోన్లు.. ధర ఎంతో తెలుసా?

వివో కంపెనీ రిలీజ్ చేయబోయే ఫస్ట్ ఫ్యాన్ ఎడిషన్ ఫోన్ కూడా ఇదే. వివో X200 కన్నా తక్కువ ధరకు మార్కెట్లో లభ్యమవుతుందని అంచనా. నివేదికల ప్రకారం.. వివో X200 FE సరసమైన ధరకే ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ ఫీచర్లను అందించవచ్చు.

ఈ వివో ఫోన్ చైనాలో లాంచ్ అయిన వివో S30 ప్రో మినీ రీబ్రాండెడ్ వెర్షన్ అని నివేదికలు చెబుతున్నాయి. ఈ వివో ఫోన్ కచ్చితమైన వివరాలు ఇంకా రివీల్ కాలేదు. వివో X200 FE లాంచ్ టైమ్‌లైన్, స్పెసిఫికేషన్లు, ధర, ఇతర వివరాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

వివో X200 FE స్పెసిఫికేషన్లు :
వివో X200 FE ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.31-అంగుళాల 1.5K 8T LTPO ప్యానెల్‌తో రానుంది. హుడ్ కింద స్మార్ట్‌ఫోన్ LPDDR5x ర్యామ్, UFS 3.1 స్టోరేజ్‌తో వస్తుంది. మీడియాటెక్ డైమన్షిటీ 9300+ చిప్‌సెట్ నుంచి పవర్ పొందవచ్చు.

90W ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,500mAh బ్యాటరీని కలిగి ఉండవచ్చు. ఈ వివో ఫోన్ దుమ్ము, నీటి నిరోధకతకు Wi-Fi 7, బ్లూటూత్ 5.4, IP69 సర్టిఫికేషన్‌ను కూడా పొందవచ్చు. కెమెరా విషయానికొస్తే.. ఈ వివో ఫోన్ 50MP IMX921 OIS, 8MP అల్ట్రావైడ్, 50MP 2x టెలిఫోటోను కలిగి ఉంటుంది.

వివో X200 FE ధర (అంచనా)  :
నివేదికల ప్రకారం.. భారత (Vivo X200 FE) మార్కెట్లో వివో X200 FE ధర దాదాపు రూ. 50వేలు ఉంటుందని అంచనా. వివో S30 ప్రో మినీ 3499 యువాన్లకు లాంచ్ చేసింది. భారత కరెన్సీలో ధర రూ. 41,500 ఉంటుంది. అయితే, స్పెసిఫికేషన్లు, ధర గురించి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also : Google Pixel 9 Pro : ఆఫర్ అదిరింది భయ్యా.. ఈ పిక్సెల్ 9ప్రోపై దిమ్మతిరిగే డిస్కౌంట్.. ఇలా కొంటే ఇంకా తక్కువకే..!

వివో X200 FE భారత్ లాంచ్ టైమ్‌లైన్ :
ఈ ఏడాది జూలైలో లాంచ్ అవుతుందని నివేదికలు సూచిస్తున్నాయి. కచ్చితమైన వివరాలు ఇంకా రివీల్ చేయలేదు.