Apple Store : గుడ్ న్యూస్.. భారత్‌లో త్వరలో మూడో ఆపిల్ స్టోర్.. ఎక్కడో తెలుసా? అద్దె రూ. 2.9 కోట్లు అంట..!

Apple Store : ఆపిల్ మూడో రిటైల్ స్టోర్ రాబోతుంది. ఢిల్లీ, ముంబై తర్వాత మూడో ఆపిల్ స్టోర్ ప్రారంభించేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది.

Apple Store : గుడ్ న్యూస్.. భారత్‌లో త్వరలో మూడో ఆపిల్ స్టోర్.. ఎక్కడో తెలుసా? అద్దె రూ. 2.9 కోట్లు అంట..!

Apple Store

Updated On : May 30, 2025 / 4:34 PM IST

Apple Store : ఆపిల్ అభిమానులకు గుడ్ న్యూస్.. భారత్‌లో మరో కొత్త స్టోర్ ప్రారంభించేందుకు ఆపిల్ రెడీ అవుతోంది. ఇప్పటికే రెండు ఆపిల్ స్టోర్లను ఏర్పాటు చేయగా మూడో రిటైల్ స్టోర్ కూడా ప్రారంభించనున్నట్టు సమాచారం.

బెంగళూరులోని ఫీనిక్స్ మాల్ ఆఫ్ ఆసియాలో మూడో స్టోర్‌ను ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి కంపెనీ లీజు అగ్రిమెంట్‌పై సంతకం చేసినట్టు తెలిసింది.

Read Also : Motorola G Series : మోటోరోలా ఫ్యాన్స్‌కు పండగే.. పిచ్చెక్కించే ఫీచర్లతో 3 కొత్త మోటోరోలా G సిరీస్ ఫోన్లు.. ధర ఎంతంటే?

కంపెనీకి ఇప్పటికే భారత్‌లో 2 రిటైల్ స్టోర్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి ముంబై BKC, ఢిల్లీలో సాకేత్ రిటైల్ స్టోర్ ఉంది. రికార్డు సేల్స్ మధ్య ఆపిల్ భారత్‌లో రిటైల్ ఛానెల్‌ను మరింత విస్తరిస్తున్నట్లు కనిపిస్తోంది.

బిజినెస్ స్టాండర్డ్ నివేదిక ప్రకారం.. హెబ్బాల్‌లోని ఫీనిక్స్ మాల్‌లోని మొదటి అంతస్తులో ఆపిల్ రిటైల్ స్టోర్ కొనుగోలు చేసినట్లు సమాచారం.

బెంగళూరు స్టోర్ సైజు సెలెక్ట్ సిటీవాక్ మాల్‌లోని ఆపిల్ ఢిల్లీ స్టోర్‌తో సమానంగా ఉంటుంది. కానీ, ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్‌లోని 20,800 చదరపు అడుగుల కన్నా ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ఆపిల్ స్టోర్ కన్నా చిన్నదిగా ఉంటుంది.

నెలకు రూ. 17.4 లక్షలు అద్దె :
లీజు అగ్రిమెంట్ ప్రకారం.. ఏడాదికి అద్దె రూ.2.09 కోట్లు అయితే.. నెలకు రూ.17.4 లక్షలు ఉంటుందని నివేదిక పేర్కొంది. కంపెనీ మొదటి 3 ఏళ్లకు 2శాతం ఆదాయ వాటాను, ఆ తర్వాత 2.5శాతం చెల్లిస్తుంది.

కంపెనీ రూ.1.046 కోట్ల డిపాజిట్ చేసిందని నివేదిక పేర్కొంది. లీజు నిబంధనల ప్రకారం.. అద్దె ప్రతి 3 ఏళ్లకు 15శాతం పెరుగుతుంది.

భారత్‌కు ఆపిల్ కొత్త స్టోర్లు మరిన్ని రాబోతున్నాయని కంపెనీ సీఈఓ టిమ్ కుక్ ఇప్పటికే ధృవీకరించారు. నివేదికల ప్రకారం.. పూణేతో సహా నగరాల్లో ఆపిల్ స్టోర్లు అందుబాటులోకి రానున్నాయి. అదనంగా, ఢిల్లీ NCR, ముంబైలలో కూడా కొత్త స్టోర్ల కోసం ప్రదేశాలను టెక్ దిగ్గజం పరిశీలిస్తోంది.

Read Also : Google Pixel 9 Pro : ఆఫర్ అదిరింది భయ్యా.. ఈ పిక్సెల్ 9ప్రోపై దిమ్మతిరిగే డిస్కౌంట్.. ఇలా కొంటే ఇంకా తక్కువకే..!

కొత్త ఆపిల్ స్టోర్ బెంగళూరులోని 13 ఎకరాల ఫీనిక్స్ మాల్ ఆఫ్ ఆసియాలో ప్రారంభం కానుంది. 1.2 మిలియన్ చదరపు అడుగుల రిటైల్ స్థలాన్ని కలిగి ఉంది. లీజు ఒప్పందం ప్రకారం.. ఈ ప్రత్యేకమైన జోన్‌లో ఆపిల్ తప్ప ఇతర పోటీదారులకు స్థలాన్ని లీజుకు ఇవ్వకూడదు.