WhatsApp Status : వావ్.. వాట్సాప్ స్టేటస్‌లో ఇన్‌స్టాగ్రామ్ రేంజ్ కొత్త ఫీచర్లు.. భలే ఉన్నాయిగా.. ఓసారి లుక్కేయండి..!

WhatsApp Status : వాట్సాప్ స్టేటస్‌లో ఇన్‌స్టాగ్రామ్ మాదిరి కొత్త ఫీచర్లు రానున్నాయి. యూజర్ల కోసం ఎలాంటి ఫీచర్లు రాబోతున్నాయంటే..

WhatsApp Status : వావ్.. వాట్సాప్ స్టేటస్‌లో ఇన్‌స్టాగ్రామ్ రేంజ్ కొత్త ఫీచర్లు.. భలే ఉన్నాయిగా.. ఓసారి లుక్కేయండి..!

WhatsApp Status

Updated On : May 31, 2025 / 4:15 PM IST

WhatsApp Status : వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. స్టేటస్ కోసం సరికొత్త ఫీచర్ రాబోతుంది. యూజర్లను ఆకట్టుకునేందుకు ఇన్‌స్టాగ్రామ్ మాదిరి ఆకర్షణీయమైన కొత్త ఫీచర్లను అందించనుంది. ఇందులో ఫొటోల కోసం కోల్లెజ్ లేఅవుట్‌లు, మ్యూజిక్ షేరింగ్, ఫొటో స్టిక్కర్లు, యాడ్ యువర్స్ స్టిక్కర్లు ఉన్నాయి.

Read Also : WhatsApp : బిగ్ అలర్ట్.. జూన్ 1 నుంచి ఈ ఐఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి!

రాబోయే రోజుల్లో వాట్సాప్ కొత్త అప్‌డేట్స్ అందరి యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. వాట్సాప్ స్టేటస్ ఫీచర్‌ను మరింత ఇంటరాక్టివ్‌గా మార్చాలని భావిస్తోంది. ఈ కొత్త ఫీచర్లలో ఇమేజ్ లేఅవుట్‌, యాడ్ యువర్స్ స్టిక్కర్లు ఇన్‌స్టాగ్రామ్ మాదిరిగా అందించనుంది.

1) లేఅవుట్ :
వాట్సాప్ యూజర్లకు కొత్త ఎడిటింగ్ టూల్ ద్వారా కొత్త లేఅవుట్ అందించనుంది. ఫొటోలకు తగినట్టుగా లేఅవుట్‌తో 6 ఫొటోలను సులభంగా యాడ్ చేసుకోవచ్చు.

2) మ్యూజిక్ :
ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్లు ఈ ఫీచర్‌ ఎలా వాడుతున్నారు? అలాగే వాట్సాప్ ఇటీవల వాట్సాప్ స్టేటస్‌కు మ్యూజిక్ యాడ్ చేసే ఆప్షన్ ప్రవేశపెట్టింది. ఇప్పుడు, కంపెనీ వినియోగదారులు ఎంచుకున్న పాటతో స్టేటస్ అప్‌డేట్‌ చేయొచ్చు. మ్యూజిక్ స్టిక్కర్‌ను షేర్ చేసే ఆప్షన్ కూడా రానుంది.

3) ఫొటో స్టిక్కర్లు :
వాట్సాప్ స్టేటస్‌లో ఫొటోలను స్టిక్కర్‌లుగా యాడ్ చేయొచ్చు. ఈ ఫొటోలను స్టేటస్‌లో షేర్ చేసే ముందు ఎంచుకున్న సైజు, షేప్ లోకి ఎడిట్ చేసుకోవచ్చు.

4) యాడ్ యువర్స్ :
ఇన్‌స్టాగ్రామ్‌లో ‘Add Yours’ స్టిక్కర్లను వినియోగించుకోవచ్చు. మెసేజ్ షేర్ చేసి ఇతరులను చాట్‌లో జాయిన్ కావాలని ఇన్వైట్ చేస్తారు. అచ్చం అలాంటి ఫీచర్ ఇప్పుడు వాట్సాప్‌లో కూడా వస్తోంది.

Read Also : New Rules : జూన్ 1 నుంచి కొత్త రూల్స్.. క్రెడిట్ కార్డు నుంచి ఆధార్ అప్‌డేట్‌ వరకు.. 5 ముఖ్యమైన మార్పులివే..!

దాంతో వాట్సాప్ కూడా పబ్లిక్‌గా మరింత యాక్టివ్ అవుతుంది. ఈ ఫీచర్లన్నీ అతి త్వరలో అందుబాటులోకి రానున్నాయి. వాట్సాప్ కొత్త ఫీచర్లు యాక్సస్ చేయాలంటే తప్పనిసరిగా మీ వాట్సాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేయాలి.