IRCTC AskDISHA 2.0 : రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై ట్రైన్ టికెట్ బుకింగ్ చాలా ఈజీ.. రీఫండ్ స్టేటస్ చెకింగ్ కూడా..!

IRCTC AskDISHA 2.0 : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. IRCTC AskDISHA 2.0 ద్వారా ట్రైన్ టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చు. రీఫండ్ స్టేటస్ కూడా చెక్ చేయొచ్చు.

IRCTC AskDISHA 2.0 : రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై ట్రైన్ టికెట్ బుకింగ్ చాలా ఈజీ.. రీఫండ్ స్టేటస్ చెకింగ్ కూడా..!

IRCTC AskDISHA

Updated On : May 31, 2025 / 4:54 PM IST

IRCTC AskDISHA 2.0 : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అడ్వాన్స్‌డ్ ఏఐ ఆధారిత వర్చువల్ అసిస్టెంట్ (AskDISHA 2.0)ను ప్రవేశపెట్టింది. రైల్వే ప్రయాణీకులకు సర్వీసులను మరింత సులభతరం చేస్తోంది.

Read Also : New Rules : జూన్ 1 నుంచి కొత్త రూల్స్.. క్రెడిట్ కార్డు నుంచి ఆధార్ అప్‌డేట్‌ వరకు.. 5 ముఖ్యమైన మార్పులివే..!

రైలు టిక్కెట్లను బుక్ చేయడం, రీఫండ్ స్టేటస్‌ చెక్ చేయడం, ప్రయాణ సంబంధిత ప్రశ్నలను సులభంగా తెలుసుకోవచ్చు. ఈ సరికొత్త వర్చువల్ అసిస్టెంట్ ద్వారా ట్రైన్ టికెట్ బుకింగ్ ప్రక్రియ అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. అందరి యూజర్లకు అర్థమవయ్యేలా యూజర్ ఇంటర్‌ఫేస్ ఉంటుంది.

రైల్వే ప్రయాణికులు ఇంగ్లీష్, హిందీ, హింగ్లిష్, గుజరాతీతో సహా అనేక ఇతర భాషలలో వాయిస్ కమాండ్స్ ఉపయోగించి టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. టెక్స్ట్ లేకుండా సమాచారాన్ని కోరే యూజర్లకు ప్రయోజనకరంగా ఉంటుంది.

అంతేకాదు.. ఇకపై మీ IRCTC పాస్‌వర్డ్‌ కూడా గుర్తుపెట్టుకోవాల్సి పనిలేదు. AskDISHA 2.0 OTP అథెంటికేషన్ ద్వారా సురక్షితంగా టికెట్ బుకింగ్‌ చేసుకోవచ్చు.

క్యాన్సిలేషన్ లేదా ఫెయిల్ ట్రాన్సాక్షన్లకు వేగంగా రీఫండ్‌ పొందవచ్చు. భవిష్యత్తులో స్పీడ్ బుకింగ్‌ కోసం ప్రయాణీకుల తమ వివరాలను స్టోర్ చేసుకోవచ్చు. ఫెయిల ట్రాన్సాక్షన్లపై మళ్లీ ట్రై చేయండి. ఒకవేళ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే.. 15 నిమిషాల్లోపు మళ్లీ ట్రై చేయొచ్చు.

AskDISHA 2.0తో రైలు టిక్కెట్లను ఎలా బుక్ చేయాలి? :

  • IRCTC వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి లేదా IRCTC మొబైల్ యాప్‌ను ఓపెన్ చేసి AskDISHA ఆప్షన్ ఎంచుకోండి.
  • ‘Hello’ లేదా ‘Ticket Book’ అని టైప్ చేయడం లేదా వాయిస్ కమాండ్‌ల ద్వారా చాట్‌ చేయండి.
  • వాయిస్ అసిస్టెంట్.. మీ సోర్స్ స్టేషన్, గమ్యస్థానం, ప్రయాణ తేదీ, ఏసీ, స్లీప్ క్లాస్ ఏదో ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
  • అందుబాటులో ఉన్న రైళ్ల లిస్టు, సమయాలు, సీట్ల వివరాలు కనిపిస్తాయి.
  • మీకు నచ్చిన రైలు, క్లాస్, సీటును ఎంచుకోండి.
  • అసిస్టెంట్ వివరాలను వెరిఫై చేస్తుంది. అవసరమైతే OTP-ఆధారిత అథెంటికేషన్ సహా పేమెంట్ చేయాలి.
  • లాగిన్ వివరాలు లేకుండా సులభంగా నిమిషాల్లో మీ టిక్కెట్లను పై విధంగా బుక్ చేసుకోవచ్చు.

AskDISHA 2.0తో రీఫండ్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి? :

  • IRCTC వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌ ఓపెన్ చేసి (Ask DISHA) ఆప్షన్ ఎంచుకోండి.
  • చాట్‌లో ‘Refund Status’ టైప్ చేయండి. లేదంటే వాయిస్ కమాండ్స్ వాడండి.
  • కింది ఆప్షన్లలో ఏదైనా రీఫండ్ టైప్ ఎంచుకోండి. టికెట్ క్యాన్సిల్ డిపాజిట్ రసీదు (TDR)అని ఉంటుంది.
  • PNR నంబర్‌ను ఎంటర్ చేయండి.. టికెట్ కోసం PNR నంబర్‌ను ఎంటర్ చేయండి.
  • AskDISHA మీ రీఫండ్ స్టేటస్ డిస్‌ప్లే చేస్తుంది.

AskDISHA 2.0తో రైలు టికెట్‌ ఎలా క్యాన్సిల్ చేయాలి? :

Read Also : WhatsApp Status : వావ్.. వాట్సాప్ స్టేటస్‌లో ఇన్‌స్టాగ్రామ్ రేంజ్ కొత్త ఫీచర్లు.. భలే ఉన్నాయిగా.. ఓసారి లుక్కేయండి..!

  • IRCTC వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌ ఓపెన్ చేసి Ask DISHA ఆప్షన్ ఎంచుకోండి.
  • సెర్చ్ బాక్సులో టికెట్ క్యాన్సిల్ అని టైప్ చేయండి.
  • లాగిన్ కోసం మీ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
  • మీ బుక్ చేసిన టిక్కెట్ల వివరాలు కనిపిస్తాయి.
  • క్యాన్సిల్ చేసే టికెట్‌ను ఎంచుకోండి.
  • కన్ఫార్మ్ తర్వాత టికెట్ క్యాన్సిల్ అవుతుంది.
  • మీ అకౌంటులో క్యాన్సిల్ స్టేటస్‌తో పాటు SMS కూడా వస్తుంది.