ఆజంఖాన్ గెలిస్తే.. మహిళకు రక్షణ ఉండదు : జయప్రద

సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజంఖాన్ వ్యాఖ్యలపై రాంపూర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి జయప్రద తీవ్రంగా స్పందించారు.

  • Publish Date - April 15, 2019 / 07:07 AM IST

సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజంఖాన్ వ్యాఖ్యలపై రాంపూర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి జయప్రద తీవ్రంగా స్పందించారు.

సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజంఖాన్ వ్యాఖ్యలపై రాంపూర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి జయప్రద తీవ్రంగా స్పందించారు. మహిళలపై గౌరవం లేని వ్యక్తుల్ని పోటీ చేయకుండా అడ్డుకోవాలని డిమాండ్ చేశారామె. ఇలాంటి వారు గెలిస్తే ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడుతుందన్నారు. మహిళలకు రక్షణ లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు జయప్రద. ఇలాంటి వారి బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారామె.
Read Also : గెలుపుపై అనుమానాలు లేవు, 150కిపైగా సీట్లు ఖాయం : చంద్రబాబు ధీమా ​​​​​​​

రాజకీయల్లోకి వచ్చిన మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. తమ బుద్ధిని బయటపెట్టుకుంటున్నారని వ్యాఖ్యానించారామె. రాజకీయాల్లో ప్రత్యక్ష విమర్శలు మానివేసి.. మహిళల వ్యక్తిగత జీవితాలపైనా.. వారి అందం, ధరించే దుస్తులపై వ్యాఖ్యలు చేస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జయప్రద.

కాంగ్రెస్ యూపీ ప్రచార కమిటీ ఇన్ చార్జ్ ప్రియాంక గాంధీపై కూడా పలువురు బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆజంఖాన్ జయప్రదపై ఇలాంటి వ్యాఖ్యలు చేయటం మహిళలపై వారుకున్న భావనను తెలియజేస్తోందన్నారు. రాజకీయ పరంగా కాకుండా వ్యక్తిగతంగా వ్యాఖ్యానించటం సరికాదనే విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 
Read Also : తిరగబడిన తులాభారం : శశి థరూర్‌కి గాయాలు

ట్రెండింగ్ వార్తలు