Vegetarian crocodile: 75 ఏళ్ల వయసులో మరణించిన శాకాహార మొసలి.. కేరళ దేవాలయంలో కన్నుమూత

దాదాపు ఏడు దశాబ్దాలుగా కేరళలోని అనంతపద్మనాభ స్వామి ఆలయంలోని కొలనులో ఉంటున్న బబియా అనే మొసలి కన్నుమూసింది. ఈ మొసలి పూర్తిగా శాకాహారి.

Vegetarian crocodile: కేరళలోని కాసారాగాడ్ జిల్లాలో ఉన్న అనంతపద్మనాభ స్వామి ఆలయానికి సంబంధించిన బబియా అనే మొసలి కన్నుమూసింది. ఈ మొసలి వయసు 75. ఈ మొసలి పూర్తిగా శాకాహారి. ఆలయంలోని బెల్లం, బియ్యంతో చేసిన ప్రసాదం తింటూ ఉండేది.

Apple Watch: యాపిల్ వాచ్ మరో ఘనత… క్లినికల్ టెస్టుకు ముందే వెల్లడించిన ప్రెగ్నెన్సీ రిజల్ట్

అనంతపద్మనాభ స్వామి ఆలయంలోని కొలనులో ఈ మొసలిని చాలా దశాబ్దాల నుంచి పెంచుతున్నారు. సాధారణంగా మొసళ్లు మాంసాహార జీవులు. కానీ, ఈ మొసలి మాత్రం ఆలయంలో అందించే శాకాహారమే తినేది. అలాగే ఇన్నేళ్లుగా ఉంటున్నప్పటికీ, భక్తులకు ఎలాంటి హానీ తలపెట్టలేదు. అది స్వేచ్ఛగా తిరిగేది. ఎంతోమంది భక్తులు ఈ మొసలిని చూసేందుకు ఆసక్తి చూపేవాళ్లు. అయితే, శనివారం నుంచి ఈ మొసలి కనిపించలేదు. అధికారులు ఈ మొసలి కోసం గాలించారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి పదకొండున్నర గంటల సమయంలో ఆలయంలోని తటాకంలో తేలుతూ కనిపించింది. దీంతో బబియా అనే ఈ మొసలి మరణించిందని అధికారులు గుర్తించారు.

Girl Drowns: నీటిలో మునిగిపోతున్న చెల్లిని కాపాడి ప్రాణాలు కోల్పోయిన అక్క

ఈ విషయాన్ని ఆలయ అధికారులు పోలీసులకు, పశు సంవర్ధక శాఖ అధికారులకు తెలియజేశారు. వారు మొసలిని బయటకు తీశారు. మొసలిని చివరిసారి చూసేందుకు భక్తులు, స్థానిక నేతలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కాగా, బబియా మృతిపై కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే సంతాపం ప్రకటిస్తూ ట్వీట్ చేశారు.