Snakes in ATM
OMG.. Snakes in ATM : ఏటీఎంలోంచి కరెన్సీ నోట్లకు బదులు పాము పిల్లలు బయటకు రావటం కలకలం కలిగించింది ఉత్తరాఖండ్ లోని నైనిటాల్ లో. నైనితాల్ జిల్లాలోని రామ్‌నగర్ కోసీ రోడ్డులో ఉన్న ఎస్‌బీఐకు చెందిన ఏటీఎంకు డబ్బులు విత్‌డ్రా చేసుకోవటానికి
బుధవారం (మే24,2023) సాయంత్రం ఓ వ్యక్తి వెళ్లాడు. డబ్బుల కోసం చేయాల్సిన ప్రాసెస్ చేశాడు.డబ్బులు వస్తాయని ఎదురు చూస్తుండా ఓ పాముపిల్ల బయటకు వచ్చింది. అంతే అతను షాక్ అయ్యాడు. దీంతో అతను ఇది ఏటీఎం మిషనా? లేక పాముల పుట్టా? అని ఆశ్చర్యపోయాడు.
సదరు వ్యక్తి మెషీన్‌లో ఏటీఎం కార్డు పెట్టగానే.. అతడికి పాముపిల్ల కనిపించింది. వెంటనే ఏటీఎం సెక్యూరిటీ గార్డుకు విషయాన్ని తెలిపాడు. అలాగే సేవ్ ది స్నేక్ అండ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు చంద్రసేన్ కశ్యప్ కూడాసమాచారం అందించాడు. దీంతో అతను వెంటనే ఘటనాస్థలానికి వచ్చారు. అప్పటికే అక్కడికి చేరుకున్న బ్యాంకు అధికారులు.. ఏటీఎంను తెరిచారు. అందులో 10 పాము పిల్లలు ఉన్నట్లు గుర్తించారు చంద్రసేన్. ఆ విషపూరితమైన పాములని తెలిపారు. వాటికి ఎటువంటి ఇబ్బంది కలుగకుండా వాటిని పట్టుకుని సురక్షితంగా అడవిలో విడిచిపెట్టారు.ఆ తరువాత బ్యాంకు సిబ్బంది ఆ ఏటీఎంను తాత్కాలింగా మూసివేశారు.