వైరల్ వీడియో: స్కూటీతో సహా..శివాలయంలో నందీశ్వరుడి కాళ్లపై పడిపోయిన అమ్మాయి!!

గుడి బైటే ఎందుకమ్మా..?రా..పాదాభివందం చేస్కోమ్మా..అంటూ సాక్షాత్తు పరమశివుడే ఆజ్ఞాపించినట్లు..నా స్వామి గుడి ముందుకు వచ్చి గుడి బైటి నుంచే వెళ్లిపోతావా?! ఎలా వెళతావో చూస్తానని శివుడి వాహనం నందీశ్వరుడు హుంకరించాడేమో! దానికి సంబంధించి ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ అమ్మాయి ఏకంగా మోటర్ సైకిల్ తో సహా గుడిలోకొచ్చి పడిపోయింది. నందీశ్వరుడి కాళ్లమీద పడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మహారాష్ట్రలోని వాకడ్ లో ఓఅమ్మాయి గుడి బైట మోటర్ సైకిల్‌పై కూర్చుని స్కార్ఫ్ తో ముఖానికి మాస్క్ కట్టుకుంటోంది.అలా కట్టుకున్న మాస్క్ ను సర్ధుకుంది.తరువాత బండి స్టార్ట్ చేసింది. కానీ స్టార్ట్ అవ్వలేదు. ఏంటాని అనుకుంటూ మరోసారి స్టార్ట్ చేయటంతో అది స్టార్ట్ అవ్వటం..స్వీడ్ గా వచ్చి గుడి గోడకు గుద్దుకోవటం..తరువాత ఆ అమ్మాయి మోటర్ సైకిల్ తో సహా నందీశ్వరుడి పాదాలపై పడిపోవటం అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఈ వీడయోను చూసినవారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు.
వైరల్‌గా మారిన ఈ వీడియోను చూసినవారంతా… ‘బయటి నుంచి మొక్కుబడిగా దండం పెట్టుకుంటున్న భక్తురాలిని భగవంతుడు ఆలయం లోనికి రప్పించుకున్నాడంటూ’ కామెంట్ చేస్తున్నారు. కాగా బస్సులో వెళ్తూ..లేదా ఏదైనా వాహనాలపై వెళ్తు ఏదైనా గుడి కనిపిస్తే వెళ్తూ వెళ్తూ దేవుడి ముఖాన ఓ దండం పెట్టేయటం సాధారణంగా మారిపోయింది. ఈ క్రమంలో ఈ వీడియో చూసివారంతా బయటి నుంచి మొక్కుబడిగా దండం పెట్టుకుంటున్న భక్తురాలిని భగవంతుడు ఆలయం లోనికి రప్పించుకున్నాడంటూ’ కామెంట్స్ చేస్తున్నారు. చూస్తుంటే అలాగే ఉంది..మరి మీరు కూడా ఓ లుక్కేయండీ ఈ వైరల్ వీడియోపై..
See Also | CAAపై కేంద్రం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది… నాకే బర్త్ సర్టిఫికేట్ లేదు : సీఎం కేసీఆర్