Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ దెబ్బకు బహవల్‌పూర్ ఉగ్రవాద స్థావరం ఎలా మారిందో చూడండి.. వీడియో వైరల్

పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌ బహవల్‌పూర్ నగరంలో ఉన్న జైషే మహమ్మద్ కు చెందిన సుభాన్ అల్లా కేంద్రంపై భారత క్షిపణి దాడులు చేశాయి

Bahawalpur terrorist camp

Operation Sindoor: పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం అర్ధరాత్రి అందరూ నిద్రపోతున్నవేళ క్షిపణులు, డ్రోన్లతో పాకిస్థాన్ తోపాటు, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో విరుచుకుపడింది. భారత సరిహద్దులకు అవతల 100 కిలో మీటర్ల దూరం వరకూ వెళ్లి తొమ్మిది ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఇందులో పీవోకేలో ఐదు, పాకిస్థాన్ లోని నాలుగు ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయి. ఇందుకోసం 24 క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. దాడుల్లో 80మంది ఉగ్రవాదులు మరణించారని, 60 మంది గాయపడ్డారని భారత ఆర్మీ ప్రకటించింది.

Also Read: Pak soldiers: పాకిస్థాన్ ఆర్మీని భారీ దెబ్బకొట్టిన బీఎల్ఏ.. 12మంది సైనికులు హతం..

మురీద్కేలోని లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాద కేంద్రం, బహవల్‌పూర్ లోని జైషే మహమ్మద్ కు చెందిన సుభాన్ అల్లా కేంద్రం, తెమ్రా కలాన్ లోని జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరం, సియాల్ కోట్ లోని హిజ్బుల్ ముజాహిదీన్ మొహమూనా జోయా కేంద్రం, బర్నాలాలో లష్కరే తోయిబాకు చెందిన అహ్లే హడిత్ స్థావరం, కోట్లీలోని జైషే మహమ్మద్ కు చెందిన అబ్బాస్ కేంద్రం, కోట్లీలోని హిజ్బుల్ ముజాహిదీన్ స్థావరం, ముజఫరాబాద్ సవాయ్ నాలాలో లష్కరే శిబిరం, ముజఫరాబాద్ లోని సయ్యద్ నా బిలాల్ ఉగ్రవాద స్థావరంపై భారత ఆర్మీ దాడులు చేసింది. ఈ దాడుల్లో ఆయా భవనాలు ధ్వంసమయ్యాయి.

Also Read: మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజర్ కి మైండ్ బ్లాంక్ అయ్యే దెబ్బ.. ఆపరేషన్ సిందూర్ లో 10 మంది ఫ్యామిలీ మెంబర్స్ మృతి

పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌ బహవల్‌పూర్ నగరంలో ఉన్న జైషే మహమ్మద్ కు చెందిన సుభాన్ అల్లా కేంద్రంపై భారత క్షిపణి దాడులు చేశాయి. దాడుల తరువాత ఆ ఉగ్రవాద శిబిరం శిథిలావస్థకు చేరింది. దాడి తరువాత అక్కడ ఉగ్రవాద శిబిరం పరిస్థితికి సంబంధించి వీడియోను ఏఎన్ఐ పోస్టు చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.