Bajaj Electric Scooter : త్వరలో హైదరాబాద్‌‌లో బజాజ్ చేతక్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

భారతదేశంలో ఎలక్ర్టిక్ వాహనాలకు ఫుల్ డిమాండ్ ఏర్పడుతోంది. వినియోగదారులను..ఆకట్టుకొనేందుకు పలు మోడళ్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి పలు కంపెనీలు. బజాజ్ కంపెనీ కూడా ఎలక్ట్రిక్ వాహనాలను సిద్ధం చేస్తోంది. హైదరాబాద్ మార్కెట్ లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను ప్రవేశపెట్టేందుకు బజాజ్ ఆటో లిమిటెడ్ రెడీ అయిపోయింది.

Bajaj electric scooter : భారతదేశంలో ఎలక్ర్టిక్ వాహనాలకు ఫుల్ డిమాండ్ ఏర్పడుతోంది. వినియోగదారులను..ఆకట్టుకొనేందుకు పలు మోడళ్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి పలు కంపెనీలు. బజాజ్ కంపెనీ కూడా ఎలక్ట్రిక్ వాహనాలను సిద్ధం చేస్తోంది. హైదరాబాద్ మార్కెట్ లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను ప్రవేశపెట్టేందుకు బజాజ్ ఆటో లిమిటెడ్ రెడీ అయిపోయింది. ఇప్పటికే నాగపూర్ లో చేతక్ ఈవీ షోరూమ్ ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేస్తోంది. నాగ్ పూర్ తర్వాత..చెన్నై, హైదరాబాద్ లలో తమ స్కూటర్ తెచ్చేలా బజాజ్ ప్లాన్ చేస్తోంది.

Read More : Sangareddy : మారణాయుధాలతో తిరుగుతున్నవ్యక్తి అరెస్ట్

1990 దశకంలో :-
బజాజ్ చేతక్…గతంలో ఈ వాహనాలకు ఫుల్ డిమాండ్ ఉండేది 90వ దశకంలో స్కూట్ విభాగంలో బజార్ చేతక్ వినియోగదారుల మన్ననలు పొందింది. అయితే..మార్కెట్ లోకి పలు కంపెనీలు ప్రవేశించి..బైక్ లను విడుదల చేశాయి. దీంతో బజాజ్ చేతక్ లను పక్కన పెట్టి..ఇతర వాహనాల వైపు మళ్లిపోయారు. చేతక్ స్కూటర్ వాహనాల అమ్మకాలు గణనీయంగా తగ్గిపోయాయి.

Read More : Tirumala : తిరుమలలో భక్తులను మోసం చేస్తున్న 27 మంది అరెస్ట్

ఎలక్ట్రిక్ వాహనాలు :-
ఎలక్ట్రిక్ వాహనాల వైపు బజాజ్ కంపెనీ దృష్టి సారించింది. అందులో భాగంగా చేతక్ ఈవీని మార్కెట్ లోకి తెచ్చేందుకు సిద్ధమైంది. రెండు వేరియంట్లు సిద్ధం చేసింది. అర్బన్, ప్రీమియం కలర్స్ లను మార్కెట్ లో విడుదల చేయనుంది. షోరూమ్ ప్రకారం అర్బన్ ధర రూ. 1,42,620 ఉండగా..ప్రీమియం ధర రూ. 1,4,620గా ఉంది. ఇందులో రెండు కిలోవీట్ బ్యాటరీలో అమర్చారు. మూడు సంవత్సరాలు, లేదా 50 వేల కిలోమీటర్ల వారంటీ అందిస్తున్నారు. ఈ వాహనాలకు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే…85 నుంచి 85 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ వెల్లడిస్తోంది.

Read More : Warangal Bhadrakali : భద్రకాళీ ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు

ఫుల్ రెస్పాండ్ :-
బజాజ్ ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్ లోకి విడుదల చేస్తోంది. రెండు వేరియంట్ లలో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాల్లో దర్శనం ఇవ్వడంతో వినియోగదారుల నుంచి ఫుల్ రెస్పాండ్ వస్తోంది. మార్కెట్ లోకి రాకముందే..ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ లోనే బైక్ లన్నీ అమ్ముడై పోతుండడం విశేషం. కొద్ది రోజుల్లోనే..హైదరాబాద్ రోడ్లపై బజాజ్ చేతక్ ఈవీ పరుగులు పెట్టనుంది.

ట్రెండింగ్ వార్తలు