Bajaj Housing Finance: కొత్త ఇల్లు కొనాలనుకునే వారికి బజాజ్ హౌజింగ్ ఫైనాన్స్ గుడ్ న్యూస్
కొత్త ఇల్లు కొనాలనుకుంటున్నారా.. అయితే బజాజ్ హౌజింగ్ ఫైనాన్స్ అందిస్తున్న గుడ్ న్యూస్ మీ కోసమే. కొత్త ఏడాది సందర్భంగా ప్రత్యేక ఆఫర్ న మీ ముందుంచింది. అర్హులైన గృహ రుణ దరఖాస్తుదారుల

Bajaj Home Finance
Bajaj Housing Finance: కొత్త ఇల్లు కొనాలనుకుంటున్నారా.. అయితే బజాజ్ హౌజింగ్ ఫైనాన్స్ అందిస్తున్న గుడ్ న్యూస్ మీ కోసమే. కొత్త ఏడాది సందర్భంగా ప్రత్యేక ఆఫర్ న మీ ముందుంచింది. అర్హులైన గృహ రుణ దరఖాస్తుదారులకు తక్కువ వడ్డీ రేటుకే ఇస్తుంది. అధికారిక వెబ్ సైట్లో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఉంచింది. ప్రత్యేకంగా 6.65శాతానికే వడ్డీరేట్లను ప్రారంభిస్తుండగా.. ఈ ఆఫర్ కొంత కాలం వరకే పరిమితం కానుంది.
లోన్ కావాలనుకునేవారు.. కచ్చితంగా శాలరీ వచ్చే ఎంప్లాయ్, డాక్టర్ లేదా చార్టర్డ్ అకౌంటెంట్ అయి ఉండాలి. అప్లికెంట్ కచ్చితంగా మూడు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థ లేదా మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగం చేసి ఉండాలి.
ఎంబీబీఎస్ లేదా అంతకంటే ఎక్కువ అర్హత కలిగిన వైద్యులకు.. ఆసుపత్రి లేదా రిజిస్టర్డ్ హెల్త్ కేర్ ప్రొవైడర్తో లేదా వారి స్వంత ప్రాక్టీస్‌లో కనీసం 3 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం ఉండాలి. ప్రాక్టీస్ సర్టిఫికేట్, 3 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్లు కూడా ఈ ఆఫర్ పొందడానికి అర్హులే.
ఇది కూడా చదవండి : గోవాలో ఛిల్ అవుతున్న శ్రద్ధా
దరఖాస్తుదారుడి సిబిల్ స్కోరు 750 లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి అని తెలిపింది. మంచి క్రెడిట్ స్కోరు ఉన్నవారు వడ్డీ రేటు తక్కువ పొందే అవకాశం ఉన్నట్లు తెలిపింది. చివరిగా.. కొత్త ఇల్లు కొనేవారు 26 జనవరి 2022 నాటికి రుణదాత అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. 28 డిసెంబర్ 2021 నుంచి 26 జనవరి 2022 మధ్య కాలంలో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసి, 25 ఫిబ్రవరి 2022 నాటికి రుణం తీసుకున్న వారు మాత్రమే ఈ వడ్డీ రేటు పొందగలరు.