Assam: భజరంగ్ దళ్ శిక్షణ శిబిరంలో తుపాకుల కలకలం.. కేసు నమోదు చేసిన పోలీసులు

జిల్లాలోని మోర్నోయి గ్రామంలో నిర్వహించిన శిబిరంలో 350 మంది యువకులు యుద్ధ కళలు, రాజకీయాలు, ఆధ్యాత్మికతపై పాఠాలు నేర్చుకోవడంతో పాటు ఆయుధ శిక్షణ పొందారని బజరంగ్ దళ్ తెలిపింది

Bajrang Dal: అస్సాం రాష్ట్రంలోని దర్రాంగ్ జిల్లాలోని ఓ పాఠశాలలో ఆయుధ శిక్షణా శిబిరం నిర్వహించినందుకు గాను భజరంగ్ దళ్ కార్యకర్తలపై అస్సాం పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళ్‌దై పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్ 153ఏ/34 (మతం, జాతి, పుట్టిన ప్రదేశం, నివాసం, భాష ఆధారంగా వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించడంతో పాటు సామరస్య పరిరక్షణకు విఘాతం కలిగించే చర్యలు) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

TSRTC : హైదరాబాద్ సిటీ బస్సుల్లో డే పాస్ ధరలు పెంపు.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనమైన మరుసటి రోజే

మంగళ్‌దాయిలోని మహర్షి బిద్య మందిర్‌లో రాష్ట్రీయ బజరంగ్ దళ్ శిక్షణకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఆయుధ శిక్షణా శిబిరాన్ని నిర్వహించడంలో పాల్గొన్న వారిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అస్సాం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జిపి సింగ్.. దర్రాంగ్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. ఈ విషయమై డీజీపీ స్వయంగా ట్విటర్ ద్వారా స్పందిస్తూ “రిఫరెన్స్ మంగళ్‌దై వీడియో మీద తగిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, ఈ విషయంపై దర్యాప్తు చేసి చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని దర్రాంగ్ ఎస్పీకి ఆదేశించాము” అని ట్వీట్ చేశారు.

Petrol Price Hike: బాబోయ్.. పాకిస్థాన్‌లో భారీగా పెరిగిన ఇంధన ధరలు.. ఇప్పుడెంతో తెలుసా?

జిల్లాలోని మోర్నోయి గ్రామంలో నిర్వహించిన శిబిరంలో 350 మంది యువకులు యుద్ధ కళలు, రాజకీయాలు, ఆధ్యాత్మికతపై పాఠాలు నేర్చుకోవడంతో పాటు ఆయుధ శిక్షణ పొందారని బజరంగ్ దళ్ తెలిపింది. పొరుగు దేశాల నుంచి అక్రమ వలసదారుల భద్రతా బెదిరింపులను ఎదుర్కోవడానికి ఇటువంటి శిబిరాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్లు బజరంగ్ దళ్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ఈ విషయమై అస్సాం కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత దేబబ్రత సైకియా సోమవారం స్పందిస్తూ.. ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మకు రాసిన లేఖ రాశారు. అందులో నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని, క్యాంపు నిర్వహించడానికి నిర్వాహకులకు తెలియకుండా లేదా నిర్వాహకులకు అనుమతి ఇవ్వడంలో జిల్లా యంత్రాంగం పాత్రపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు.

TS High Court : హైకోర్టులో పెండింగ్ లో ఉన్న 30 మంది ఎంఎల్ఏల ఎలక్షన్ పిటిషన్లు.. వీటిలో 25కి పైగా అధికార పార్టీ ఎంఎల్ఏలవే

”ఇలాంటి శిబిరాలు నిర్వహించడం ఇదే మొదటిసారి కాదు. 2017లో కూడా బజరంగ్ దళ్ ఆయుధ శిక్షణ ఇచ్చే శిబిరాన్ని నిర్వహించింది. 2019లో మళ్లీ వివిధ ప్రాంతాల్లో ఇలాంటి శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడంతో కాంగ్రెస్ దీనిపై నిరసన వ్యక్తం చేసింది” అని ప్రతిపక్ష నాయకుడు అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్న తరుణంలో రాష్ట్రంలో శాంతిభద్రతలను నెలకొల్పేందుకు ఒక వర్గం మతపరమైన ఉన్మాదాన్ని రెచ్చగొట్టేందుకు రెచ్చిపోతున్నాయని ఆయన విమర్శించారు.

ట్రెండింగ్ వార్తలు