Bharat Bandh : నిరసనలో అపశృతి… డీసీపీ కాలుపై నుంచి దూసుకెళ్లిన కారు

భారత్ బంద్ ర్యాలీలో ఓ నిరసనకారుడు కారును డీసీపీ పాదాలపైకి ఎక్కించాడు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులోని గోరగుంటెపాళ్య వద్ద జరిగింది.

Bharat Bandh

Bharat Bandh : భారత్ బంద్ ర్యాలీలో ఓ నిరసనకారుడు కారును డీసీపీ పాదాలపైకి ఎక్కించాడు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులోని గోరగుంటెపాళ్య వద్ద జరిగింది. నిరసన కారుడు కారులో వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు, అతడు ఆగకుండా కారు పోనిచ్చాడు.. దీంతో అక్కడ ఉన్న బెంగళూరు సీటు నార్త్ డివిజన్ డీసీపీ మీనా కాలిపై నుంచి కారు వెళ్ళింది. ఈ ప్రమాదంలో ఆయన కాలి మడమకు తీవ్ర గాయమైంది. వెంటనే పోలీసులు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. నిరసన కారుడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు.

Read More : Hyderabad Traffic: ముసిరిన చీకట్లతో స్తంభించిపోయిన ట్రాఫిక్

ఇక మరోవైపు బంద్ విజయవంతమైంది. ఢిల్లీ, ముంబై నగరాల్లో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఢిల్లీలో భారీ ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు మూడు గంటలపాటు రోడ్లపైనే ఉండిపోయారు వాహనదారులు. ఇక సౌత్ ఇండియాలో బంద్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. గుజరాత్, బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాల్లో.. నిరసనకారులు రోడ్లపైకి వచ్చి దిగ్బంధం చేశారు. వాహన రాకపోకలు జరగకుండా అడ్డుకున్నారు.

Read More : Google Chrome వాడుతున్నారా? అయితే జాగ్రత్త.. వెంటనే ఈ పని చేయండి

జాతీయ రహదారులను దిగ్బంధం చేసి తన నిరసన వ్యక్తం చేశారు. రైతు చట్టాలను రద్దు చేయాలనీ డిమాండ్ చేశారు. ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రైతు ఉద్యమ నాయకులు తెలిపారు. కాగా గతంలో కూడా అనేక సార్లు రైతు చట్టాలపై చర్చలు జరిగాయి. కానీ అవి ఒక కొలిక్కి రాలేదు. దీంతో రైతు సంఘం నాయకులు మరోసారి నిరసన బాటపట్టారు.