West Bengal : సాయంత్రం 5గంటల వరకు బ్యాంకులు పని చేస్తాయి

బ్యాంకుల సమయాల్లో మార్పులు చేశారు. ఇప్పటి నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇవి పని చేయనున్నాయి.

West Bengal : సాయంత్రం 5గంటల వరకు బ్యాంకులు పని చేస్తాయి

West Bengal

Updated On : September 2, 2021 / 8:35 AM IST

Banks West Bengal : బ్యాంకుల సమయాల్లో మార్పులు చేశారు. ఇప్పటి నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇవి పని చేయనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 02 గంటల వరకు మాత్రమే పని చేస్తున్నాయనే సంగతి తెలిసిందే. శనివారం, ఆదివారాల్లో బ్యాంకులు పనిచేయవు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఓ పథకానికి సంబంధించిన విషయంలో బ్యాంకుల సమయాల్లో మార్పులు చేయాలని ప్రభుత్వం భావించింది.

Read More : Drugs Case: నేడు ఈడీ ముందుకు చార్మీ.. కెల్విన్ వాంగ్మూలంలో ఏముంది?

బ్యాంకుల పని గంటల వేళల్లో మార్పులు చేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. బ్యాంకులు సాయంత్రం 05 గంటల వరకు పని చేస్తాయని, 2021, సెప్టెంబర్ 02వ తేదీ గురువారం నుంచి అమల్లోకి వస్తుందని సీఎం మమత బెనర్జీ వెల్లడించారు. గతంలో మాదిరిగానే పొడిగించినట్లు తెలిపారు.

Read More :Leopard : మేకల మందపై చిరుతపులి దాడి…పోరాడి కొడవలితో నరికి చంపిన కాపరి

వెస్ట్ బెంగాల్ లో కరోనా కేసులు తగ్గడంతో..అక్కడ ‘లక్ష్మీ భండార్’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో…కొత్తగా బ్యాంకు ఖాతాలు తెరవాల్సి ఉంటుంది. బ్యాంకుల పని వేళలను పొడిగించాల్సిన అవసరం ఏర్పడింది. బ్యాంకుల పని వేళలను గతంలో మాదిరిగా..సాధారణ స్థాయికి మార్పు చేసినట్లు సీఎం మమత తెలిపారు.