‘అస్థిపంజరం’ పువ్వులు : వాన పడితే కరిగిపోతాయ్

  • Published By: veegamteam ,Published On : April 21, 2019 / 07:43 AM IST
‘అస్థిపంజరం’ పువ్వులు  : వాన పడితే కరిగిపోతాయ్

Updated On : April 21, 2019 / 7:43 AM IST

పువ్వును చూస్తే ఆహ్లాదం కలుగుతుంది. దానికో అందమైన పేరు కూడా ఉంటుంది. కానీ మనం చూసే  ఈ పువ్వు ఎంత అందంగా ఉంటుంది. దాని పేరు మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది.తెల్లగా మల్లె పువ్వులా మెరిసిపోవటమ కాక చిత్ర విచిత్రమైన లక్షణాలు ఈ పువ్వు సొంతం. స్పెషల్ అనేది లేకుంటే దాని గురించి చెప్పుకునేదేముంటుంది చెప్పండి. ఈ పువ్వు పేరుతో పాటు దానికుండే లక్షణాలు కూడా వెరీ వెరీ స్పెషల్. దాని పేరు ‘స్కెలిటన్ ఫ్లవర్’ అంటే అస్థిపంజరం పువ్వు. అంత అందమైన ఈ పువ్వుకు ఇదేం పేరు అనుకుంటున్నారు కదూ. 

మరి ఈ పువ్వుకుండే చిత్రమైన లక్షణం గురించి చెప్తా. వాడిపోయిన పువ్వుపై చిటికెడు నీళ్లు పోస్తే తిరిగి తాజాగా మారుతుంది. కానీ ఈ అస్థిపంజరం పువ్వు మాత్రం  నీళ్లు తగిలితే చాలు..తెల్లగా ఉండే ఈ పూలు పారదర్శకంగా మారిపోతాయి. జపాన్‌లో పర్వత ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే ఈ పువ్వులు.. వర్షకాలంలో గాజుపూలను తలపిస్తూ భలే అందంగా కనిపిస్తాయి. పర్యాటకులకు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. 

ఈ పూల రేకుల కణాల నిర్మాణం వల్ల ఆ పువ్వులు నీరు తగలగానే కరిగిపోయినట్లుగా ఉంటాయంటున్నారు వీటిపై పరిశోధించిన సైంటిస్టులు. పూల రేకులు బాగా పలచగా ఉండటం వల్ల నీటిరు పడగానే దాన్ని గ్రహించి, పారదర్శకంగా మారిపోతున్నాయంటున్నారు.‘కెమిస్ట్రీ వరల్డ్’ రిపోర్ట్ ప్రకారం.. పొడి వాతావరణంలో ఈ పూల రేకుల్లోని ఎయిర్ లిక్విడ్ ఇంటర్‌ఫేస్ రిఫ్లెక్ట్స్ వల్ల ఆ పువ్వులు తెల్లగా కనిపిస్తాయి. నీరు తగలగానే అవి నీటి అంతర్ముఖ (వాటర్ ఇంటర్‌ఫేస్) ప్రక్రియ వల్ల పారదర్శకంగా మారిపోతాయి. ఈ ప్రత్యేకత వల్ల ఈ స్కెలిటన్ పూలు అటు ప్రకృతి ప్రేమికులకు, ఇటు పరిశోధకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.