Viral Video : ఆకులతో ఏమంత్రం వేశాడోగానీ..తేనెపట్టునుంచి తేనె భలే తీశాడే..!

ఓ వ్యక్తి ఒట్టి చేతులతో తేనెపట్టునుంచి తేనెను తీసిన వైనం భలే గమ్మత్తుగా ఉంది. దీంతో ఈ వీడియోను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.మరీ మీరు కూడా ఓ లుక్ వేయిండీ..

Beekeeper Extracts Honey With Bare Hands Gose

beekeeper extracts honey with bare hands : తేనె.ఎన్ని సంవత్సరాలు అయినా పాడవ్వని ఓకే ఒక్క పదార్ధం. లక్షలాది పువ్వుల నుంచి తెనేను వేలాది తేనెటీగలు సేకరించి తేనెతుట్టెలో (తేనెపట్టు) భద్రపరుస్తాయి. కానీ మనుషులు దాన్ని చక్కగా తస్కరించేస్తారు. అలా తీసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.కొంతమంది పొగపెట్టి తేనెటీగలు పారిపోయేలా చేసి తేనెపట్టునుంచి తేనెను సేకరిస్తారు. మరికొంతమంది మరోలాగా చాలా జాగ్రత్తలు తీసుకుని తీస్తారు.

ఎందుకంటే తేనెటీగ కుట్టిందంటే బొబ్బలు వచ్చేస్తాయి. అదే కొన్ని వేల తేనెటీగలు దాడి చేసి కుడితే మనిషి చనిపోయే ప్రమాదం కూడా ఉంది. తేనెతుట్టెల జోలికి ఎవ్వ‌రూ వెళ్ల‌రు. అందుకే తేనెపట్టునుంచి తెనేను చాలా జాగ్రత్తలు తీసుకుని సేకరిస్తారు.

కానీ ఓ వ్యక్తి మాత్రం ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోకుండానే ఓ తేనెపట్టునుంచి అత్యంత చాకచక్యంగా తేనె మొత్తాన్ని పిండేశాడు. మరి ఆ తేనెటీగలకు సదరు వ్యక్తి ఏమంత్రం వేశాడో మరి. తేనెపట్టునుంచి తేనెను సేకరించ సమయంలో సదరు వ్యక్తి ఎవరో కనిపించలేదుగానీ..అతను ఓ రెమ్మను పట్టుకుని సుతారంగా తేనెపట్టుపై ఉన్న తేనెటీగలపై రాసాడు. అంతే అవన్నీ చక్కగా వెళ్లిపోయాయి. అతనిమీద దాడి చేయాలేదు ఏ ఒక్క తేనెటీగ కూడా ఆ తరువాత చాకుతో తేనె తుట్టెను కట్ చేసి అత్యంత లాఘవంగా తేనెను సేకరించేశాడు. మరి ఈ టిప్ ఏంటో తేనె సేకరించేవారికి తెలిస్తే యంచక్కా వారు కూడా ఇలాగే తీసుకోవచ్చు కదూ..

కాగా..తేనెటీగ‌ల‌ను పెంచి.. వాటికి తేనెతుట్టెల‌ను ఏర్పాటు చేసి కూడా కొంద‌రు తేనెను సేక‌రిస్తుంటారు. అటువంటి తేనెటీగ‌లు అయితే.. స‌హ‌జంగా అడ‌వుల్లో ఉండే తేనెటీగ‌ల్లా కుట్ట‌వు అని కొంద‌రు అంటుంటారు కొంతమంది. ఒట్టి చేతుల‌తో ఏమాత్రం భ‌యం లేకుండా.. తేనెతుట్ట‌ను ముట్టుకోవ‌డం అనేది మాత్రం నిజంగా డేర్‌స్టెప్పే అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. చక్కగా సుతారంగా ఓ రెమ్మతో ఏదో మంత్రం వేసినట్లుగా తేనెటీగల్ని పారగొట్టి తేనె తీసిన ఈ వీడియో రెడిట్‌లో వైర‌ల్ అవుతోంది.