అసోం,బెంగాల్ లో తొలిదశ పోలింగ్ కు సర్వం సిద్ధం

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తొలి దశ ఎన్నికలకు పోలింగ్ శనివారం( మార్చి- 27,2021) జరగనుంది. తొలి దశలో భాగంగా పశ్చిమ బెంగాల్ లోని 30 స్థానాలకు, అసోంలోని 47 స్థానాలకు శనివారం పోలింగ్ జరగనుంది.

Bengal, Assam ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తొలి దశ ఎన్నికలకు పోలింగ్ శనివారం( మార్చి- 27,2021) జరగనుంది. తొలి దశలో భాగంగా పశ్చిమ బెంగాల్ లోని 30 స్థానాలకు, అసోంలోని 47 స్థానాలకు శనివారం పోలింగ్ జరగనుంది.

ఇప్పటికే ఎన్నికల సంఘం ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే పోలింగ్ బూతులకు సిబ్బంది చేరుకున్నారు. ఇక పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు చేపట్టారు. బెంగాల్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పారామిలటరీ బలగాలు రంగంలోకి దిగాయి. సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా బలగాలు గస్తీ నిర్వహిస్తున్నాయి.ప టిష్టమైన భద్రత మధ్య ఎన్నికలు జరుగుతాయని అధికారులు తెలిపారు ఇక ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటిస్తున్నట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

ఇక,బెంగాల్ లో రేపు ఎన్నికలు జరుగుతున్న 30 నియోజకవర్గాల్లో ఎక్కువ సీట్లు నక్సల్స్ ప్రభావిత జంగ్లీమహల్ ప్రాంతంలోనివే. 2016లో ఈ ప్రాంతంలో టీఎంసీ భారీగా సీట్లు కైవసం చేసుకుంది. 30 సీట్లలో మొత్తం 27 టీఎంసీ గెలుచుకోగా… కాంగ్రెస్ రెండు సీట్లు, ఆర్‌ఎస్పీ ఒక స్థానంలో గెలుపొందింది. అయితే, 2019 సార్వత్రిక ఎన్నికలలో ఈ ప్రాంతంలోని ఎక్కువ పార్లమెంటరీ స్థానాలను గెలుచుకోగలిగినందున ఈ ప్రాంతంలో తమకు పైచేయి ఉందని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది.

మరోవైపు,అసోంలో మొదటి దశలో సీఎం సర్బానంద సోనోవాల్,స్పీకర్ సహా పలువురు కేబినెట్ మంత్రులు పోటీలో ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు