Man Barks: రేషన్ కార్డులో తన పేరు మార్చాలంటూ కుక్కలా మొరుగుతూ అధికారులకు మొరపెట్టుకున్నాడు

సదరు వ్యక్తికి చిరాకెత్తుకొచ్చి కుక్కలా మొరుగుతూ ప్రభుత్వ కార్యాలయంలోని అధికారుల చుట్టూ ఆ రేషన్ కార్డు కాగితాలతో తిరిగాడు. కార్యాలయంలో పని కాలేదు. ఒకరోజు రోడ్డు మీద ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అని గుర్తు ఉన్న కారులోని అధిరికి చూసి అతన్ని వెంబడించి తన కాగితాలను సదరు అధికారికి ఇచ్చి, కుక్కలా మొరుగుతూ సమస్యను వివరించాడు.

Man Barks: రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఒక వ్యక్తి ప్రభుత్వ అధికారుల వాహనానికి అడ్డుపడి కుక్కలా మొరుగుతూ తన పని చేయమని మొర పెట్టుకుంటున్నాడు. సదరు వ్యక్తి ఇచ్చిన దరఖాస్తును స్వీకరించిన ఆ అధికారి.. రెండు రోజుల్లో పని పూర్తి చేస్తామని హామీ ఇచ్చాడు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని దూరే అనే ప్రాంతానికి సంబంధించిన ఘటన ఇది.

ఇంతకీ విషయం ఏంటంటే.. బెంగాల్‭లోని దూరేకి చెందిన శ్రీకాంత్ దత్తా అనే వ్యక్తికి తన రేషన్ కార్డులో పేరు తప్పుగా పడింది. దీంతో దూరే ప్రభుత్వ కార్యాలయం వద్దకు వెళ్లి దరఖాస్తు చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా శ్రీకాంత్ కుమార్ అని సరిగానే ఉన్నప్పటికీ దత్తా అనే స్థానంలో మెండల్ అని మళ్లీ తప్పుగా పడింది. దీంతో సదరు వ్యక్తి మళ్లీ పేరు మార్పుకు దరఖాస్తు చేసుకున్నాడు. ఇక ఈసారైతే ఏకంగా దత్తా అనే స్థానంలో కుత్తా అని పడింది.

అంతే, సదరు వ్యక్తికి చిరాకెత్తుకొచ్చి కుక్కలా మొరుగుతూ ప్రభుత్వ కార్యాలయంలోని అధికారుల చుట్టూ ఆ రేషన్ కార్డు కాగితాలతో తిరిగాడు. కార్యాలయంలో పని కాలేదు. ఒకరోజు రోడ్డు మీద ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అని గుర్తు ఉన్న కారులోని అధిరికి చూసి అతన్ని వెంబడించి తన కాగితాలను సదరు అధికారికి ఇచ్చి, కుక్కలా మొరుగుతూ సమస్యను వివరించాడు. విషయం అర్థం చేసుకున్న ఆ అధికారి రెండు రోజుల్లో సవరిస్తామని హామీ ఇచ్చారు. తన పేరు మాటిమాటికీ తప్పుగా పడుతుండడంతో విసిగిపోయి ఇలా ప్రవర్తించానని శ్రీకాంత్ తెలిపాడు.

Trump Account Reinstated: డొనాల్డ్ ట్రంప్ అకౌంట్ రీస్టోర్‭ చేసిన ట్విట్టర్‭.. ట్రంప్, మస్క్‭లపై నెటిజెన్ల ఫన్నీ ట్రోల్స్

ట్రెండింగ్ వార్తలు