Trump Account Reinstated: డొనాల్డ్ ట్రంప్ అకౌంట్ రీస్టోర్‭ చేసిన ట్విట్టర్‭.. ట్రంప్, మస్క్‭లపై నెటిజెన్ల ఫన్నీ ట్రోల్స్

కొందరు ట్రంప్ రాకడపై అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే, ఇదే సమయంలో కొందరు ఫ్రీడం ఆఫ్ స్పీచ్ ప్రకారం సబబే అంటున్నారు. ఇక కొందరైతే ఈ విషయమై మస్క్‭ను ట్రోల్ చేస్తున్నారు. ట్విట్టర్ కొన్నప్పటికీ సంచలన నిర్ణయాలతో వార్తల్లో టాప్‭లో ఉంటోన్న మస్క్.. ట్రంప్ ఖాతా రికవరీ విషయంలో కూడా టాప్‭లోనే ఉన్నారు. ‘మస్క్ నుంచి ట్విట్టర్‭ను ఇంకెవరైనా కొనుగోలు చేయాలా?’ అంటూ కూడా కొందరు పోల్స్ నిర్వహిస్తున్నారు

Trump Account Reinstated: డొనాల్డ్ ట్రంప్ అకౌంట్ రీస్టోర్‭ చేసిన ట్విట్టర్‭.. ట్రంప్, మస్క్‭లపై నెటిజెన్ల ఫన్నీ ట్రోల్స్

As Donald Trump's Account Gets Reinstated, Internet Flood Twitter With Funny Memes

Trump Account Reinstated: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను పునరుద్దరించారు ట్విట్టర్ అధినే ఎలాన్ మస్క్. శనివారం ఈ విషయమై పోల్ నిర్వహించగా 51.8 శాతం మంది ట్రంప్ ఖాతా పునరుద్ధరణకు అనుకూలంగా ఓటేశారు. దీంతో ఆయన ఖాతాను పునరుద్దరిస్తున్నట్లు మస్క్ ప్రకటించారు, పునరుద్ధరించేశారు కూడా. అయితే ఈ విషయమై నెట్టింట్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏ విషయంపై అయినా మీమ్స్‭తో విరుచుకుపడే నెటిజెన్లు దీనిపై కూడా మీమ్స్ వర్షం కురిపిస్తున్నారు. అంటు ట్రంప్, ఇటు మస్క్ ఎవరినీ వదిలిపెట్టకుండా తమదైన శైలిలో ట్రోల్స్ చేస్తున్నారు.

Akhilesh Yadav: బాబాయ్ శివపాల్ పాదాలను తాకిన అఖిలేష్.. కోల్డ్ వార్ ముగిసినట్టేనా?

కొందరు ట్రంప్ రాకడపై అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే, ఇదే సమయంలో కొందరు ఫ్రీడం ఆఫ్ స్పీచ్ ప్రకారం సబబే అంటున్నారు. ఇక కొందరైతే ఈ విషయమై మస్క్‭ను ట్రోల్ చేస్తున్నారు. ట్విట్టర్ కొన్నప్పటికీ సంచలన నిర్ణయాలతో వార్తల్లో టాప్‭లో ఉంటోన్న మస్క్.. ట్రంప్ ఖాతా రికవరీ విషయంలో కూడా టాప్‭లోనే ఉన్నారు. ‘మస్క్ నుంచి ట్విట్టర్‭ను ఇంకెవరైనా కొనుగోలు చేయాలా?’ అంటూ కూడా కొందరు పోల్స్ నిర్వహిస్తున్నారు. ఇక ట్రంప్ ఖాతా పునరుద్ధరణతో ఇప్పటికే బ్యాన్ చేసిన వాటిని మళ్లీ రీస్టోర్ చేయాలనే డిమాండ్ కూడా కొనసాగుతోంది.

ట్విట్టర్ ట్రోల్స్‭లో కొన్ని…

Suryakumar Yadav: సెంచరీతో చెలరేగిన సూర్య కుమార్.. న్యూజిలాండ్‌పై 65 పరుగుల తేడాతో ఇండియా ఘన విజయం