Akhilesh Yadav: బాబాయ్ శివపాల్ పాదాలను తాకిన అఖిలేష్.. కోల్డ్ వార్ ముగిసినట్టేనా?

పార్టీలో కుటుంబంలో అంతర్గత విబేధాలతో ములాయం, శివపాల్ విడిపోయారు. పార్టీ పగ్గాలను అఖిలేష్‭కు అప్పగించడంతోనే శివపాల్ అలిగి వేరు కుంపటి పెట్టుకున్నారని విమర్శలు బలంగానే వచ్చాయి. 2017 నుంచి ఈ విభేదాలు ఉన్నాయి. కాగా, 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇరు వర్గాలను కలిపే ప్రయత్నాలు జరిగాయి

Akhilesh Yadav: బాబాయ్ శివపాల్ పాదాలను తాకిన అఖిలేష్.. కోల్డ్ వార్ ముగిసినట్టేనా?

Akhilesh Yadav Touches Uncle Shivpal Yadav's Feet

Akhilesh Yadav: ములాయం కుటుంబంలో ముసలం ముగిసినట్లేనా, లేదంటే ఇది కేవలం ఎన్నికల స్టంటా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అయితే తాజా పరిస్థితుల్ని చూసినట్టైతే అంతా సద్దుమణిగినట్లే కనిపిస్తోంది. ఈ మాట ఏకంగా ములాయం కుటుంబ సభ్యులే స్వయంగా ప్రకటించారు కూడా. మెయిన్‭పురి లోక్‭సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ సందర్భంగా ఆదివారం మెయిన్‭పురి నియోజకవర్గంలో సమాజ్‭వాదీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో అఖిలేష్, డింపుల్ సహా ములాయం తమ్ముడు శివపాల్ యాదవ్ సైతం పాల్గొన్నారు.

ఈ సందర్భంలోనే శివపాల్ పాదాలను అఖిలేష్ తాకి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం అఖిలేష్ మాట్లాడుతూ తమ మధ్య ఎప్పుడూ ఎలాంటి విబేధాలు లేవని, ఉండబోవని అన్నారు. మెయిన్‭పురి ఉప ఎన్నిక బరిలో అఖిలేష్ భార్య డింపుల్ యాదవ్ బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచి ములాయం ఎంపీ గెలిచారు. అయితే ఆయన గత నెలలో మరణించడంతో ఉప ఎన్నిక ఏర్పడింది.

పార్టీలో కుటుంబంలో అంతర్గత విబేధాలతో ములాయం, శివపాల్ విడిపోయారు. పార్టీ పగ్గాలను అఖిలేష్‭కు అప్పగించడంతోనే శివపాల్ అలిగి వేరు కుంపటి పెట్టుకున్నారని విమర్శలు బలంగానే వచ్చాయి. 2017 నుంచి ఈ విభేదాలు ఉన్నాయి. కాగా, 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇరు వర్గాలను కలిపే ప్రయత్నాలు జరిగాయి. ములాయం సింగ్ యాదవ్ పిలుపు మేరకు వీరిద్దరూ ఏకమైనప్పటికీ.. ఆ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో మళ్లీ దూరంగానే ఉంటూ వచ్చారు. మళ్లీ ఇన్నాళ్లకు మెయిన్‭పురి ఉప ఎన్నికతో ఇలా ఒకే వేదికపై కనిపించారు.

Self Respect: గవర్నర్ తొలగింపు, సీఎం రాజీనామా.. ఆత్మగౌరవంపై శివసేన డిమాండ్