Bengal Polls : టీఎంసీ అభ్యర్థుల లిస్ట్ రిలీజ్..నందిగ్రామ్ నుంచి మమత పోటీ

Bengal Polls వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తృణముల్ కాంగ్రెస్ పార్టీ..రాష్ట్రంలోని 294 స్థానాలకుగాను 291 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఉత్తర బెంగాల్‌లోని 3 స్థానాలకు పార్టీ అభ్యర్థులను నిలపడం లేదని పార్టీ తెలిపింది. ఈ ఎన్నికల్లో 50 మంది మహిళలు, 42 మంది ముస్లింలు, 79 మంది ఎస్సీ, 17 మంది ఎస్టీలకు టీఎంసీ అవకాశం కల్పించింది. ఉత్తర బెంగాల్‌లోని 3 స్థానాలకు పార్టీ అభ్యర్థులను నిలపడం లేదని పార్టీ తెలిపింది.

ఇక,ఈసారి తాను నందిగ్రామ్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు సీఎం మమత తెలిపారు. క్రికెటర్ మనోజ్ తివారీ శివ్ పూర్ నుంచి టీఎంసీ అభ్యర్థిగా పోటీకి దిగుతున్నారు. అయితే ఆశక్తికరంగా సీనియర్ టీఎంసీ లీడర్,ప్రస్తుత ఆర్థికమంత్రి అమిత్ మిత్రా పేరు ఇవాళ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో లేకపోవడం అందరినీ ఆశ్చర్చపర్చింది. దాదాపు 50మంది మహిళలు టీఎంసీ నుంచి అసెంబ్లీ బరిలో ఉన్నారు.

సీఎం మమతా బెనర్జీ 2011ఉప ఎన్నికల్లో మరియు 2016అసెంబ్లీ ఎన్నికల్లో భవానీపూర్ నుంచి పోటీ చేసి గెలిచారు. కాగా,ఇప్పుడు భవానీపూర్ స్థానానికి టీఎంసీ అభ్యర్థిగా సోభన్దేబ్ ఛటర్జీ పేరుని పార్టీ ప్రకటించింది. అయితే ఆమె ఈసారి మమత తన సొంత నియోజకవర్గం భవానిపూర్‌ను వదిలి నందిగ్రామ్‌ నుంచి పోటీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల టీఎంసీని వీడి బీజేపీలో చేరిన ఒకప్పటి మమత అనుంగ శిష్యుడు,మాజీ మంత్రి సువేందు అధికారికి నందిగ్రామ్‌లో మంచి పట్టుంది. ఈ నేపథ్యంలో దీదీ నందిగ్రామ్‌ నుంచి పోటీకి దిగుతుండటం ఆసక్తిని రేకెత్తిస్తున్నది. మమతని ఓడించకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సువెందు అధికారి సవాల్ విసిరిన విషయం తెలిసిందే.

294 స్థానాలున్న వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ మార్చి-27 నుంచి ఏప్రిల్-29వరకు ఎనిమిది దశల్లో జరగనున్నాయి. మార్చి-27న మొదటి దశ,ఏప్రిల్-1న రెండో దశ,ఏప్రిల్-6న మూడో దశ,ఏప్రిల్-10న నాల్గవ దశ,ఏప్రిల్-17న ఐదవ దశ,ఏప్రిల్-22న ఆరవ దశ,ఏప్రిల్-26న ఏడవ దశ,ఏప్రిల్-29న ఎనిమిదశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మే-2న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మే-30న వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ గడువు ముగియనుంది.

ట్రెండింగ్ వార్తలు