Leftover Food To The Needy : పెళ్లిలో మిగిలిపోయిన ఫుడ్‌‍ని పేదలకు పంచిన మహిళ

మన దేశంలో ఫంక్షన్లు లేదా పెళ్లి కార్యక్రమాల్లో చాలా ఫుడ్ వేస్ట్ అవుతుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇలా మిగిలిపోయిన ఆహారాన్ని కొందరు ఏదైనా అనాధాశ్రామానికి పంపించడం

Leftover Food To The Needy : మన దేశంలో ఫంక్షన్లు లేదా పెళ్లి కార్యక్రమాల్లో చాలా ఫుడ్ వేస్ట్ అవుతుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇలా మిగిలిపోయిన ఆహారాన్ని కొందరు ఏదైనా అనాధాశ్రామానికి పంపించడం లేక పేదల కోసం ఏర్పాటే చేసే ఫ్రిడ్జ్ లలో ఉంచడమే చేస్తుంటారు . మరికొందరు అయితే ఎందుకొచ్చిన బాధలే ఇదంతా అని ఫంక్షన్ హాల్స్ లోనే పడేసి వెళ్తుంటారు.

అయితే తాజాగా బెంగాల్ కు చెందిన ఓ మహిళ భిన్నంగా ఆలోచించి చేసిన పని ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో ఆమె చెసిన పనికి సోషల్ మీడియాలో ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. గొప్ప మనసు మీది అంటూ నెటిజన్లు ఆ మహిళను ప్రశంసిస్తున్నారు. ఇంతకీ ఎవరా మహిళ? ఆమె చేసిన ఆ మంచి పని ఏంటో తెలుసుకుందాం.

ఆదివారం తెల్లవారుజామున 1గంట సమయంలో కోల్ కతాలోని రానాఘాట్ రైల్వే స్టేషన్ దగ్గరకి సాంప్రదాయ పెళ్లి దుస్తుల్లో వెళ్లిన ఓ మహిళ.. త‌న సోద‌రుడి వివాహంలో మిగిలిపోయిన ఆహారాన్ని రైల్వే ఫ్లాట్ ఫాంపై ఉన్న పేద ప్ర‌జ‌ల‌కు పంచింది. రైల్వే ఫ్లాట్ ఫాంపై కూర్చొని పేపర్ ప్లేట్స్ లో ఆమె స్వయంగా ఆహారాన్ని వడ్డించి వాళ్ల ఆక‌లిని తీర్చింది.

ఇదంతా గ‌మనించిన నిలంజన్ మొండాల్ అనే ఓ వెడ్డింగ్ ఫోటోగ్రాఫ‌ర్.. ఆమె ఫుడ్ స‌ర్వ్ చేస్తుండ‌గా ఫోటోలు తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆహారాన్ని పంచిన మహిళలను “పాపియా కర్” గా గుర్తించారు. “పాపియా కర్”ది ఎంత మంచి మనసో అంటూ నెటిజన్లు ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

ALSO READ Tourism in Kashmir : కశ్మీర్ కు పొటెత్తుతున్న పర్యాటకులు..తెలుగువాళ్లే ఎక్కువగా

ట్రెండింగ్ వార్తలు