Math Olympiad: మ్యాథ్ ఒలింపియాడ్‌లో సత్తా చాటిన శ్రీవాస్తవ.. ఆ విషయంలో తొలి భారతీయుడుగా రికార్డు

అంతర్జాతీయ మ్యాథ్ ఒలింపియాడ్ లో బెంగళూరుకు చెందిన 18ఏళ్ల బాలుడు ప్రాంజల్ శ్రీ వాస్తవ సత్తా చాటారు. జూలై 11, 12 తేదీల్లో నార్వేలోని ఓస్లోలో జరిగిన అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్ (IMO)లో బంగారు పతకం అందుకున్నాడు. ప్రాంజల్ ఈ ఏడాది ఒలింపియాడ్‌లో మొత్తం 34 స్కోరుతో గెలిచాడు.

Mathematical Olympiad

Math Olympiad: అంతర్జాతీయ మ్యాథ్ ఒలింపియాడ్ లో బెంగళూరుకు చెందిన 18ఏళ్ల బాలుడు ప్రాంజల్ శ్రీ వాస్తవ సత్తా చాటారు. జూలై 11, 12 తేదీల్లో నార్వేలోని ఓస్లోలో జరిగిన అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్ (IMO)లో బంగారు పతకం అందుకున్నాడు. ప్రాంజల్ ఈ ఏడాది ఒలింపియాడ్‌లో మొత్తం 34 స్కోరుతో గెలిచాడు. ఇటీవలి సంవత్సరాలలో అంతర్జాతీయ ఒలింపియాడ్‌లను గెలుచుకోవడం ద్వారా భారతీయ విద్యార్థులు దేశానికి గుర్తింపు తెస్తున్నారు.

Commonwealth Games 2022 : కామన్‌వెల్త్‌ గేమ్స్‌ ప్రారంభం..నేడు ఆస్ట్రేలియా-భారత్ మహిళల క్రికెట్ మ్యాచ్

తాజాగా IMOలో బంగారు పతకం సాధించడంతో మూడు బంగారు పతకాలు సాధించిన మొదటి భారతీయుడు శ్రీవాస్తవ నిలిచాడు. IMO 63సంవత్సరాల చరిత్రలో కేవలం 11 మంది మాత్రమే అతని కంటే ఎక్కువ పతకాలను గెలుచుకున్నందున, ప్రాంజల్ పేరు IMO హాల్-ఆఫ్-ఫేమ్‌లో కనిపిస్తుంది. గతంలో.. 2018లో రజత పతకాన్ని సాధించడంతో అతని విజయాల పరంపర మొదలైంది. అతను 2019లో 35 స్కోర్, 2021లో 31 స్కోర్ చేసి బంగారు పతకాన్ని సాధించాడు. కోవిడ్ మహమ్మారి కారణంగా 2020లో భారతదేశం IMOలో పాల్గొనలేదు.

Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల కెప్టెన్‌గా హర్మన్ ప్రీత్

ఈ విషయంపై శ్రీవాస్తవ మాట్లాడుతూ.. 1వ తరగతి నుండే గణితంపై‌ నాకుండే మక్కువను మా కుటుంబం గమనించిందని తెలిపారు. నేను ఈ విషయంపై అత్యంత ఆసక్తికరమైన పుస్తకాలను చదవడమే కాదు, దాని గురించి చాలా సరదా సంభాషణలు కూడా జరిగాయి. మా నాన్న నాకు ఆసక్తికరమైన కథలు చెప్పారు, మా అమ్మ, తాత నాకు జ్యామితిలో గణిత గొప్పతనం గురించి చెప్పారని చెప్పాడు. శ్రీవాస్తవ తల్లిదండ్రులు ఐటీ నిపుణులు. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నారు.