ఫస్ట్ నైట్‌ ముందు భర్త మొబైల్‌కు భార్య పోర్న్ వీడియోలు

ఫస్ట్ నైట్‌ ముందు భర్త మొబైల్‌కు భార్య పోర్న్ వీడియోలు

Updated On : March 17, 2020 / 9:06 AM IST

కొత్తగా పెళ్లైన వ్యక్తి అనుకోని సంఘటనతో షాక్ తిన్నాడు. మ్యారేజ్ గిఫ్ట్ అంటూ ఫేస్‌బుక్ మెసేంజర్‌లో తన భార్య వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు వచ్చాయి. లబోదిబోమంటూ భార్యను నిలదీస్తే తన ఏడేళ్ల ప్రేమ గురించి నిజాలు చెప్పింది. తనకు న్యాయం కావాలంటూ పోలీసులను ఆశ్రయించాడు ఆ వ్యక్తి. 

ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్న సందేశ్‌తో ప్రభుత్వ ఉద్యోగి అయిన సోనియాకు వివాహం జరిగింది. 31ఏళ్ల సందేశ్(పేరు మారింది) అనే వ్యక్తి బెంగళూరులోని సుబ్రహ్మణ్య నగర్‌లో ఉంటున్నాడు. చిక్కమగలూరులో ఉండే సోనియా అనే యువతితో 2019 నవంబరు 24న హసన్ ప్రాంతంలో పెళ్లి చేసుకున్నారు. అదే సంవత్సరం జూన్‌లో వారి ఎంగేజ్‌మెంట్ జరిగింది. 

డిసెంబరు 15న ఫస్ట్ నైట్ అని ముహర్తం ఫిక్స్ చేశారు. కానీ, డిసెంబరు 13 రాత్రి ఫేస్‌బుక్ మెసేంజర్‌లో తన భార్య వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు వచ్చాయి. వాటితో పాటు ఓ మొబైల్ నెంబర్ పంపారు. ఆ నెంబర్ కు ఫోన్ చేస్తే తన పేరు రమేశ్(పేరు మారింది) అని పరిచయం చేసుకున్నాడు. వాళ్లిద్దరి మధ్య ఏడేళ్లుగా ఉన్న ప్రేమ వ్యవహారం గురించి చెప్పాడు. 

Also Read | పదో తరగతి విద్యార్థిపై ఆటో డ్రైవర్ వేధింపులు… యువకుడిని చితకబాదిన బాలిక తల్లి

ఎటువంటి బ్రేకప్ జరగలేదని.. ఎంగేజ్‌మెంట్ తర్వాత కూడా వారిద్దరూ శారీరకంగా కలుస్తూనే ఉండేవారని చెప్పాడు. కాల్ కట్ చేసిన కాసేపటికి మళ్లీ ఫోన్‌కు వీడియో మెసేజ్ వచ్చింది. అందులో  రమేశ్ భార్య పోర్న్ వీడియో ఉంది. అంతేకాకుండా పెళ్లికి ముందు రోజు.. తర్వాతి రోజు లవర్ తో వాట్సప్ మెసేజ్ లు చేసిన స్క్రీన్ షాట్లు వచ్చాయి. ఇవన్నీ చూపించి భార్యను నిలదీసేసరికి ‘అల్లుడిగా తన కుటుంబ సభ్యులు సందేశ్‌ను ఎంత ప్రేమిస్తున్నారో..  తాను రమేశ్‌ను అంతే ప్రేమిస్తున్నానని.. అవసరమైతే వివాహ బంధాన్ని వదిలేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పింది. 

సాక్ష్యాలతో పోలీస్ కంప్టైంట్ ఇవ్వడంతో రమేశ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు కూడా తెలుసని.. అంతా కలిసి తనను మోసం చేశారంటూ అందరిపైనా కంప్లైంట్ చేశాడు. దానికి ముందే తన భార్య పోలీసులకు ఫిర్యాదు చేస్తే సూసైడ్ చేసుకుంటానని బెదిరించిందని అందులో పేర్కొన్నాడు.