Maharashtra: గవర్నర్ పదవి నుంచి దిగిపోతానంటున్న భగత్‭సింగ్ కోశ్యారి.. మోదీకి సందేశం

ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని ఏక్‭నాథ్ షిండే పడగొట్టినప్పుడు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో గవర్నర్ పాత్ర ఉందంటూ మహా వికాస్ అఘాడి ప్రశ్నించింది. ఇక గత నవంబరులో రాజ్యాం నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలను ఐకాన్‌లని చెప్తూ ఛత్రపతి శివాజీ మహారాజ్ ‘పాత ఐకాన్’ అని వ్యాఖ్యానించడం కూడా మహా రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని లేపింది.

Maharashtra: తాను గవర్నర్ పదవి నుంచి దిగిపోవాలని అనుకుంటున్నట్లు స్వయంగా ప్రకటించారు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి. సోమవారం రాజ్ భవన్ నుంచి వెలువడిన ప్రకటనలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముంబై పర్యటనకు వచ్చినప్పుడు ఈ విషయాన్ని తెలియజేసినట్లు ఆయన పేర్కొన్నారు. 2019 నుంచి మహారాష్ట్ర గవర్నర్‭గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన.. అనేక రాజకీయ కాంట్రవర్సీలకు కేంద్ర బిందువుగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి మేలు చేసే విధంగా ప్రవర్తించారని, ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు కూడా బాగానే ఉన్నాయి.

Ramcharitmanas: రామచరితమానస్ మీద మండిపడ్డ మరో నేత.. SC, ST, OBC లను తిట్టారంటూ సంచలన కామెంట్స్

‘‘సాధువులు, సంఘ సంస్కర్తలు, వీర యోధుల భూమి అయిన మహారాష్ట్ర వంటి గొప్ప రాష్ట్రానికి రాజ్య పాలకుడిగా పనిచేయడం నాకు దక్కిన గొప్ప గౌరవం. గత మూడు సంవత్సరాల నుంచి మహారాష్ట్ర ప్రజల నుంచి నేను అందుకున్న ప్రేమ, ఆప్యాయతలను ఎప్పటికీ మరచిపోలేను. ప్రధానమంత్రి ఇటీవల ముంబై పర్యటన సందర్భంగా, అన్ని రాజకీయ బాధ్యతల నుంచి తప్పుకుని, నా శేష జీవితాన్ని చదవడం, రాయడం, ఇతర కార్యకలాపాలలో గడపాలన్న కోరికను ఆయనకు తెలియజేసాను. ప్రధానమంత్రి నుంచి ప్రేమ, ఆప్యాయతలను ఇప్పటి వరకు పొందుతూ వచ్చాను. ఈ విషయంలో కూడా అదే విధంగా అందుకోవాలని ఆశిస్తున్నాను’’ అని రాజ్ భవన్ విడుదల చేసిన ప్రకటనలో గవర్నర్ పేర్కొన్నారు.

Pakistan Economic Crisis: పాకిస్థాన్‌లో దారుణ పరిస్థితులు .. పాక్‌ను గట్టెక్కించాలంటే షాబాజ్ ముందు మిగిలింది అదొక్కటే మార్గమా?

బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్‭లో కోశ్యారి సీనియర్ నేత. ఆయన హయాంలో అనేక కాంట్రవర్సీలు జరిగాయి. కొన్నింటికి ఆయనే కేంద్ర బిందువుగా ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల అనంతరం దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఈయన పదవీ కాలంలో అతిపెద్ద కాంట్రవర్సీ. ఇక ఉద్ధవ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ‘ఉద్ధవ్‭ను సెక్యూలర్ ఎప్పుడు అయ్యావంటూ’ లేఖ రాయడం రాజకీయ విమర్శలకు దారి తీసింది.

Digvijaya Singh: పుల్వామా దాడిని సర్జికల్ స్ట్రైక్స్‭ను మరోసారి తెరపైకి తెచ్చిన కాంగ్రెస్

ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని ఏక్‭నాథ్ షిండే పడగొట్టినప్పుడు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో గవర్నర్ పాత్ర ఉందంటూ మహా వికాస్ అఘాడి ప్రశ్నించింది. ఇక గత నవంబరులో రాజ్యాం నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలను ఐకాన్‌లని చెప్తూ ఛత్రపతి శివాజీ మహారాజ్ ‘పాత ఐకాన్’ అని వ్యాఖ్యానించడం కూడా మహా రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని లేపింది.

ట్రెండింగ్ వార్తలు