Digvijaya Singh: పుల్వామా దాడిని సర్జికల్ స్ట్రైక్స్‭ను మరోసారి తెరపైకి తెచ్చిన కాంగ్రెస్

2016లో జమ్మూ కశ్మీర్‭లోని ఉరిలోని 12 బ్రిగేడ్ కేంద్ర కార్యాలయంపై జరిగిన ఉగ్రదాడిలో 18 మంది జవాన్లు మరణించారు. అనంతరం, 10 రోజులకు పాకిస్తాన్ ప్రాంతంపై భారత సేనలు సర్జికల్ దాడులు చేశారు. ఇకపోతే, జమ్మూ కశ్మీర్‭లో ఉగ్రవాదం తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు అన్నీ వృధా అయ్యాయని దిగ్విజయ్ విమర్శించారు. ఆర్టికల్-370 రద్దు, నోట్ల రద్దు, కేంద్ర పాలిత ప్రాంతం చేయడం..

Digvijaya Singh: పుల్వామా దాడిని సర్జికల్ స్ట్రైక్స్‭ను మరోసారి తెరపైకి తెచ్చిన కాంగ్రెస్

No report on Pulwama, surgical strike till date: Digvijaya Singh in Jammu

Digvijaya Singh: పుల్వామాలో జవాన్ల మీద జరిగిన అమానుష దాడి సహా, పాకిస్తాన్ మీద భారత మిలిటరీ చేసిన సర్జికల్ స్ట్రైక్స్ మీద చాలా కాలంగా అభ్యంతరాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం చెప్పిన రీతిలో వాస్తవాలు కనిపించడం లేదని చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే ఇలాంటి సున్నిత అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేయడం దేశ భద్రతకు సామరస్యానికి అంత మంచిది కాదంటూ ప్రభుత్వ వర్గాలు మండిపడుతూ వస్తున్నాయి. అయితే ఈ రెండు అంశాల్ని కాంగ్రెస్ పార్టీ మరోసారి తెర మీదకు తెచ్చింది. పుల్వామా, సర్జికల్ దాడుల విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి రిపోర్ట్ ఎందుకు పార్లమెంటుకు సమర్పించలేదని కేంద్ర ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది.

Thackeray & Ambedkar: చేతులు కలిపిన థాకరే-అంబేద్కర్.. మహారాష్ట్రలో సరికొత్త రాజకీయ పొత్తు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ ‘‘పుల్వామా దాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. జవాన్లను హెలికాఫ్టర్ ద్వారా చేరవేయాలని సీఆర్‭పీఎఫ్ ముందుగానే ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ణప్తి చేసింది. కానీ మోదీ ఇందుకు అంగీకరించలేదు. ఆ తర్వాత ఎలాంటి దారుణం జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంత దారుణం జరిగిన ఏళ్లు గడుస్తున్నా దీనిపై ప్రభుత్వం ఒక్క రిపోర్టు కూడా పార్లమెంట్ ముందు సమర్పించలేకపోయింది. సర్జికల్ స్ట్రైక్స్ చేశామని ప్రభుత్వం చెప్పింది. కానీ దానికి ఆధారాలు కనిపించడం లేదు. అబద్ధాలు చెబుతూ ప్రజల్ని మోసగించారు’’ అని అన్నారు.

NRIs in US: అమెరికాలోని NRIలకు ఉపాధి కష్టాలు.. ఉద్యోగాలు కోల్పోతున్న వేలాది మంది

2016లో జమ్మూ కశ్మీర్‭లోని ఉరిలోని 12 బ్రిగేడ్ కేంద్ర కార్యాలయంపై జరిగిన ఉగ్రదాడిలో 18 మంది జవాన్లు మరణించారు. అనంతరం, 10 రోజులకు పాకిస్తాన్ ప్రాంతంపై భారత సేనలు సర్జికల్ దాడులు చేశారు. ఇకపోతే, జమ్మూ కశ్మీర్‭లో ఉగ్రవాదం తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు అన్నీ వృధా అయ్యాయని దిగ్విజయ్ విమర్శించారు. ఆర్టికల్-370 రద్దు, నోట్ల రద్దు, కేంద్ర పాలిత ప్రాంతం చేయడం.. ఇవన్నీ ఉగ్రవాదాన్ని అదుపులోకి తీసుకురాలేకపోయాయని ఆయన విమర్శించారు.