NRIs in US: అమెరికాలోని NRIలకు ఉపాధి కష్టాలు.. ఉద్యోగాలు కోల్పోతున్న వేలాది మంది

హెచ్-1బీ వీసా అనేది వలసేతర వీసా, ఇది అమెరికాకు చెందిన కంపెనీలు సైద్ధాంతిక లేదా సాంకేతిక నైపుణ్యం అవసరమయ్యే ప్రత్యేక విభాగాల్లో విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి అనుమతిస్తుంది. భారతదేశం, చైనా వంటి దేశాల నుంచి ప్రతి సంవత్సరం పదివేల మంది ఉద్యోగులను నియమించుకోవడానికి టెక్నాలజీ కంపెనీలు ఈ వీసాపై ఆధారపడతాయి. ఇక ఎల్-1ఏ, ఎల్-1బీ వీసాలు తాత్కాలిక ఇంట్రాకంపెనీ బదిలీదారులకు అందుబాటులో ఉంటాయి

NRIs in US: అమెరికాలోని NRIలకు ఉపాధి కష్టాలు.. ఉద్యోగాలు కోల్పోతున్న వేలాది మంది

Thousands Of Indian IT Professionals Struggle To Stay In US

NRIs in US: ఉద్యోగం కోసమని అమెరికా వెళ్లిన భారతీయులకు అక్కడ కూడా ఉపాధి కష్టాలు మొదలవుతున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమేజాన్ వంటి మల్టీ నేషనల్ కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగుల్ని తొలగిస్తుండడంతో ఆ ప్రభావం భారతీయులపై భారీగానే పడుతోంది. దీనికి తోడు వారి వర్క్ వీసాల గడువు దగ్గర పడుతుండడంతో, వీలైనంత తొందరలో ఉద్యోగం దొరికితే కానీ అక్కడ ఉండలేని పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగం కావాలంటే వీసా కావాలి, వీసా ఉండాలంటే ఉద్యోగం ఉండాలి.. ఇలా ఒకేసారి రెండు నెత్తిమీద పడుతుండడంతో తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు.

Kerala: కుక్కను ‘కుక్క’ అని పిలిచినందుకు ఒక వ్యక్తి హత్య

ది వాషింగ్టన్ పోస్ట్ అనే దిన పత్రిక ప్రకారం.. గత ఏడాది నవంబర్ నుంచి దాదాపు 200,000 మంది ఐటి ఉద్యోగులు వివిధ కంపెనీల తొలగించబడ్డారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్, అమెజాన్ వంటి కంపెనీల్లో ఈ తొలగింపులు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో 30 నుంచి 40 శాతం మధ్య భారతీయులే ఉన్నట్లు సమాచారం. వీరిలో గణనీయమైన సంఖ్యలో హెచ్-1బీ, ఎల్1 వీసాలపై ఉన్నారట.

Thackeray & Ambedkar: చేతులు కలిపిన థాకరే-అంబేద్కర్.. మహారాష్ట్రలో సరికొత్త రాజకీయ పొత్తు

హెచ్-1బీ వీసా అనేది వలసేతర వీసా, ఇది అమెరికాకు చెందిన కంపెనీలు సైద్ధాంతిక లేదా సాంకేతిక నైపుణ్యం అవసరమయ్యే ప్రత్యేక విభాగాల్లో విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి అనుమతిస్తుంది. భారతదేశం, చైనా వంటి దేశాల నుంచి ప్రతి సంవత్సరం పదివేల మంది ఉద్యోగులను నియమించుకోవడానికి టెక్నాలజీ కంపెనీలు ఈ వీసాపై ఆధారపడతాయి. ఇక ఎల్-1ఏ, ఎల్-1బీ వీసాలు తాత్కాలిక ఇంట్రాకంపెనీ బదిలీదారులకు అందుబాటులో ఉంటాయి. ఇందులో హెచ్-1బీ వీసాతో అమెరికా వెళ్లి, ప్రస్తుతం ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వారికి నిర్ణీత కంపెనీలో సకాలంలో ఉద్యోగం లభించకపోతే వీసా రద్దు అవుతుంది. దీంతో వారు ఉద్యోగం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.